నేడు మెగాస్టార్ చిరంజీవి 66 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. అలాగే సామాజిక మాధ్యమాల్లో మెగా అభిమానులు చిరంజీవికి సంబంధించిన అరుదైన ఫోటోలను షేర్ చేస్తూ తెగ సందడి చేస్తున్నారు.
అయితే తాజాగా టాలీవుడ్ యంగ్ అండ్ టాలెండెట్ హీరో సత్యదేవ్ చిరుకు వినూత్నంగా బర్త్‌డే విషెస్‌ను తెలియజేశారు. చిరంజీవికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, మరియు ఆయన డ్యాన్స్ స్టెప్పులపై అభిమానులు ఎలా గగ్గోలు పెడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ నేపథ్యంలో చిరంజీవి సినిమాల్లోని సూపర్ హిట్ సాంగ్స్‌కు సత్యదేవ్ అద్భుతమైన స్టెప్పులు వేసి విషెస్ తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సత్యదేవ్ డ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. కాగా, చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ (లూసిఫర్ రీమేక్)లో సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.