ఎన్టీఆర్‌కు క‌రోనా..చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

May 10, 2021 at 7:30 pm

చిన్నా, పెద్దా, ఉన్నోడు, లేనోడు, సామాన్యుడు, సెల‌బ్రెటీ అనే తేడా లేకుండా అంద‌రిపై క‌రోనా వైర‌స్ పంజా విసురుతోంది. తాజాగా టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. తనకు కరోనా సోకిందని ఎన్టీఆర్ ట్విట్టర్ లో వెల్లడించారు.

ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని స్పష్టం చేశారు. అయితే ఎన్టీఆర్‌కు క‌రోనా సోక‌డంపై ఆంధ్రప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు స్పందిస్తూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్యులు చేశారు.

తారక్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు చంద్రబాబు తాజాగా ట్వీట్ చేశారు. అలాగే ఈ సమయంలో అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. మ‌రోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేశ్ కూడా..ఎన్టీఆర్‌ క‌రోనా నుంచి సత్వరమే కోలుకోవాలని ట్వీట్ చేశారు.

ఎన్టీఆర్‌కు క‌రోనా..చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts