విలువలతో కూడిన రాజకీయాలంటే..ఇదేనా

నంద్యాల MLA భూమా నాగిరెడ్డి అకాల మరణం పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరిని కలచివేసింది మాట వాస్తవం.ఇలాంటి టైం లో తల్లి దండ్రుల్ని కోల్పోయి పుట్టెడు దుఃఖం లో మునిపోయిన భూమా పిల్లలకి ప్రతి ఒక్కరు బాసటగా నిలవాలి.విచిత్రం ఏంటంటే బాసటగా నిలవడం లోను రాజకీయమే..చివరికి సంతాపము రాజకీయమే…ఆఖరికి భూమా మరణమే ఒక శవ రాజకీయమైపోయింది.

ఇక్కడ భూమా మరణం వెనుక అధికార టీడీపీ పాత్ర మరీ ముక్యంగా అధ్యక్షుడు చంద్రబాబు పాత్ర ఎంత అనే చర్చ జరుగుతున్న మాట వాస్తవం.అధికార పార్టీ భూమా పై అట్రాసిటీ కేసు పెట్టి వేధించిన మాట వాస్తవం..చివరికి భూమా జైలు లో ఉండగా మొదటి సారి గుండె నొప్పి రావడం తో కనీస వైద్యానికి కూడా నోచుకోక ఇబ్బందులు పాలు చేసిన ఘనత ఈ ప్రభుత్వానిది.అసలే వ్యక్తిగతంగా,రాజకీయంగా తనలో సగమైనా భార్య శోభా నాగిరెడ్డిని పోగొట్టుకున్న భూమా ఈ వేధింపులకు తలొగ్గి అధికార పార్టీ పంచన చేరక తప్పలేదు.

అసలు భూమా నాగిరెడ్డి టీడీపీ లో ఏ పరిస్థితుల్లో చేరాడో మనందరికీ తెలిసిందే.చాలామంది లా జగన్ పై దుమ్మెత్తి పోసి భజన మీడియా కెక్కి రచ్చ చేసి  ఆయన జగన్తో విభేదించి టీడీపీ కి వెళ్ళలేదు.మనుగడ కోసం మరీ ముక్యంగా అధికార పార్టీ వేధింపులు తట్టుకోలేక టీడీపీ లో చేరారన్నది వాస్తవం.ఇక్క మంత్రి పదవి ఆస చూపారా లేదా..హామీలేమైనా ఇచ్చారా లేదా అన్నది అప్రస్తుతం.

ఒక రకంగా ప్రజారాజ్యం పతనం తర్వాత భూమా ఫామిలీ వైఎస్ ఫ్యామిలికీ బాగా దగ్గరయింది.ఇక శోభమ్మ మరణం తర్వాత రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా వైఎస్  కుటుంభం భూమాకు అండగా వుంది.భూమా నాగిరెడ్డి,శోభా నాగిరెడ్డి పార్టీ లు మారి ఉండొచ్చు గాక,కానీ ఏనాడు సొంత పార్టీ కి వెన్నుపోటు పొడవలేదు.ఇక్కడ వెన్నుపోటు అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే సొంత పార్టీ లో ఉంటూనే గుంటనక్కల తీరున పార్టీ కి ద్రోహం చేసే రాజకీయనాయకులు ఎంతో మంది ఉన్న ఈ రోజుల్లో భూమా ఫామిలీ రాజనీతి మెచ్చుకోదగిందే.దీనికి సరైన ఉదాహరణే టీడీపీ లో చేరిన వెంటనే నేను రాజీనామా చేసి టీడీపీ తరపున పోటీ చేస్తానని భూమా చెప్పడం.దానికి బాబుగారు ఒప్పుకోలేదనుకోండి అది వేరే విషయం.

అలాంటి ఒక వ్యక్తి మరణిస్తే కూతురికి ఫోన్ చేసి పరామర్శించి చేతులు దులిపేసుకోవడం జగన్ కి ఏపాటి న్యాయం.ఆ కుటుంబానికి అండగా నిలవాల్సిన టైం ఇది.ఇక్కడ రాజకీయాలు చూసుకోవడం ఎంతవరకు కరెక్ట్.అదే నీ తండ్రి..నువ్వెప్పుడూ చెప్పే దివంగత నేత ప్రియతమా నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారయితే ఇలాగే ఉండేదా వ్యవహారం.ఆయన రాజకీయమా వేరు వ్యక్తిగతం వేరుగా చూసే వారు.ఖచ్చితంగా అంత్యక్రియలకు హాజరయి కుటుంబాన్ని ఓదార్చేవారు రాజశేఖర్ రెడ్డి అని ఆయన్ను అభిమానించే వారెవరైనా చెప్తారు.

ఇక అసెంబ్లీ లో భూమా నాగిరెడ్డి సంతాప తీర్మానం అంటే దానికి రాకుండా పార్టీ మొత్తం వాక్ అవుట్ చెయ్యడం ఏ పాటి ధర్మం.సవాలక్ష కారణాలుండొచ్చు గాక,టీడీపీ నీచాతి నీచంగా తండ్రిని కోల్పోయి పొట్టెడు దుఃఖం తో వున్నా కూతుర్ని మరుసటి రోజు అసెంబ్లీ కి తీసుకొస్తే దానికి భజన మీడియా వ్యూహాత్మకం అనే టాగ్ లైన్ తగిలించేశాయి నిస్సిగ్గుగా.కారణాలేవయినా మనతో కొన్నేళ్లు కలిసి నడిచిన మన తోటి మనిషి చనిపోతే సంతాప తీర్మానానికి కూడా వెళ్ళకపోవడం దారుణం.

ఇవేనా విలువలతో కూడిన రాజకీయాలంటే..ఇదేనా దివంగత నేత ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన అంటే.కంటి తుడుపు చర్యలు,కుంటి సాకులు వెదుక్కొనే టైం కాదు ఇది. మనఃస్పూర్తి గా ఆ కుటుంబానికి బాసటగా నిలవాల్సిన టైం ఇది.ఇలాంటి టైం లో ప్రభుత్వం తీరుకు నీరసంగా వాక్ అవుట్ చేస్తున్నాం అనంటే జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగతంగానే కాదు రాజకీయంగానూ దిగజారిపోతున్నట్టే లెక్క.