సమయం లేదు మిత్రమా … కడపలో ఇక రణమే

స్థానిక మండలి ఎన్నికలు దగ్గరపడుతున్న దృష్ట్యా పార్టీ గెలుపుకి అవసరమైన ఓటర్లని ఒక చోటకి చేర్చండి ,నాయకులంతా అప్రమత్తం అవండి అని పార్టీ నాయకులకి ,పార్టీ శ్రేణుకులకు టీడీపీ అధ్యక్షులు మరియు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశించారు .దీనితో పార్టీ నియోజవర్గ ఇంచార్జిలు మరియు నాయకులూ ఓటర్లను శిబిరాలకు తరలిస్తూ ఉండటంతోపాటు ,మిగిలి ఉన్నవారిని కూడా తరలిస్తున్నారు .దీంతో శిబిర రాజకీయాల సందడి మరింత పెరిగింది. పోరు ప్రతిష్టాత్మకంగా మారడంతో ఇరు పార్టీలు ఎవరి వ్యూహ ప్రతివ్యూహాల్లో వారువుండటంతో ఉత్కంఠ నెలకొంటోంది.

స్థానికి సంస్థల ఎన్నికలు ఇటు అధికార పార్టీ తెలుగు దేశంకి , అటు ప్రధానమైన ప్రతిపక్షం వైస్సార్సీపీ కి  ప్రతిష్టాత్మకంగా కావటంతో  ఇరు పార్టీలు తమ సర్వ శక్తులు వడ్డీ పోరాడుతున్నాయి .కడప జిల్లాలో తప్పనిసరిగా గెలిసి జగన్ కోట బద్దలుకొట్టి  టీడీపీ పార్టీ  జెండా పాతాలని చంద్రబాబు చూస్తుంటే ,ఎలాగైనా తరతరలాగా వస్తున్న రాజకీయా వారసత్వాన్ని కాపాడుకోవాలి అని వైసీపీ చూస్తుంది దీంతో రాష్ట్రంలో ఏ స్థానిక మండలి ఎన్నికలకు లేనంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇదే తరుణంలో స్థానిక ప్రతినిధులైన ఓటర్లకు లక్షలు ఆఫర్‌ చేస్తున్నారు.

ఇప్పటికే లక్షల కార్యక్రమం పూర్తి అయ్యింది .ఇప్పుడు మిగిలిందంతా శిబిరాలను పటిష్టం చేసుకోవడమే. కాగితాల్లో వేసుకున్న లెక్కల మేరకు శిబిరాల్లో బల నిరూపణ కావాలి. ఇందుకోసం ఈ ఐదారు రోజులు ఎవరి స్థాయిలో వారు ఏ ఒక్కరినీ చెదిరిపోకుండా ప్రత్యర్థి పార్టీ నుంచి కూడా సమీకరణల వైపు దృష్టి పెట్టాలని అధినేతలు ఆదేశించడంతో ఆ మేరకు నేతలు పావులు కదుపుతున్నారు.దీనితో ఒక్కసారిగా నాయకులూ ఓటర్లని బయట తిరిగితే అసలుకే మోసవస్తుంది అని ,క్యాంపు రాజకీయాలకు తెరదీశారు .వైసీపీ, టీడీపీలకు చెందిన బయట వున్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లను శిబిరాలకు తరలించారు.

టీడీపీ పార్టీ శిబిరాన్ని శనివారం సాయంత్రం కల్లా పాండిచ్చేరికి చేరనున్నాయి,అలాగే వైసీపీ శిబిరాలు బెంగుళూరుకి   చేరుస్తున్నారు ,ఇక కాగితాలలో చూపిన విధముగా లెక్క సరిపడగా ఉన్నదో లేదో చూసికోవటానికి  అక్కడికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ హాజరుకానున్నట్లు పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం. నారా లోకేష్‌ స్థానిక ప్రతినిధులతో మాట్లాడనున్నారు. ఈ శిబిర నిర్వహణ, సమావేశానికి జిల్లాలోని ఇనచార్జిలు, ముఖ్యనేతలంతా హాజరుకానున్నారు. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం నుంచి వీరికి సమాచారం అందింది. దేశం వర్గాలు వేస్తున్న అంచనా ప్రకా రం 450మందికి తగ్గకుండా శిబిరానికి చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పాండిచ్చేరి సమావేశంలో 450 మందిని చేర్చి అక్కడ నుంచి నేరుగా పోలింగ్‌ నాటికి ఒకటి, రెండు రోజులు ముందు జిల్లాకు చేర్చే యోచనలో దేశంనేతలు వున్నట్లు సమాచారం.

టీడీపీ శిబిరంలో 450 మందిని చూపిస్తామని ఆ పార్టీ నాయకులు ధీమాగా చెబుతుంటే వైసీపీ నాయకులు 50 ఓట్లకు పైగా మెజార్టీతో గెలుస్తామని చెబుతూ వస్తుండడంతో ఈ ఎన్నికల్లో ఎవరి ఎత్తుగడలేమిటో అంతుచిక్కడం లేదు. ఇరు పార్టీలు గెలుపుపై ధీమాగా వుండడం ఉత్కంఠభరితంగా మారింది. ప్రతిష్టాత్మక పోరులో ఎవరిదో గెలుపు