ప‌వ‌న్ పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గంపై క్లారిటీ..అనంతపురం అయితే కాదు

జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ 2019 ఎన్నిక‌ల బ‌రిలో ఉండ‌డం ఫిక్స్ అయ్యింది. ప‌వ‌న్ ఇప్ప‌టికే రెండుమూడుసార్లు జ‌న‌సేన 2019 ఎన్నిక‌ల్లో ఏపీ, తెలంగాణ‌లో పోటీ చేస్తుంద‌ని, తాను రాయ‌ల‌సీమ‌లోని అనంత‌పురం జిల్లా నుంచి పోటీ చేస్తాన‌ని స్ప‌ష్ట‌మైన క్లారిటీ ఇచ్చారు. దీంతో ఏపీలో 2019 ఎన్నిక‌లు మూడు ముక్కలాట‌ను త‌ల‌పించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇక తాను ఎమ్మెల్యేగా అనంత‌పురం జిల్లా నుంచే పోటీ చేస్తాన‌ని చెప్ప‌డంతో రాజకీయంగా ప‌వ‌న్ పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గంపై పెద్ద చ‌ర్చ జ‌రుగుతోంది. ఓ వైపు అధికార టీడీపీతో పాటు విప‌క్ష వైసీపీ ప‌వ‌న్ క‌ద‌లిక‌ల‌పై జిల్లాలో బాగా కాన్‌సంట్రేష‌న్ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో జిల్లాలో పవన్ పోటీచేసే స్థానం అనంతపురమేనని ఇప్పటిదాకా చర్చల్లో ఉంది. జిల్లా కేంద్ర‌మైన అనంత‌పురంలో సామాజిక‌వ‌ర్గ ప‌రంగా కూడా ప‌వ‌న్‌కు ఫుల్ స‌పోర్టు ఉండ‌నుంది. అనంత‌పురం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌వ‌న్‌కు మిగిలిన వ‌ర్గాల్లో కూడా మంచి స‌పోర్ట్ ఉంది. ప‌వ‌న్ అక్క‌డ బ‌రిలో ఉంటే జిల్లా మొత్తం జ‌న‌సేన‌కు ఫ్ల‌స్ అవుతుంది.

ఇదిలా ఉంటే ప‌వ‌న్ పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గాల్లో నిన్న‌టి వ‌ర‌కు అనంత‌పురం పేరు ఉంటే ఇప్పుడు కొత్త‌గా అదే జిల్లాలోని క‌దిరి నియోజ‌క‌వ‌ర్గం పేరు వినిపిస్తోంది. అనంతపురం నుంచి కాకుండా కదిరినుంచి పోటీ చేస్తే జనసేన పార్టీని రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో బలోపేతం చేసుకోవచ్చుననే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. క‌దిరి చిత్తూరుతో పాటు క‌డ‌ప జిల్లాల‌కు స‌రిహ‌ద్దుల్లో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే క‌దిరి వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్రాధినిత్యం వ‌హిస్తోన్న పులివెందుల‌కు స‌మీపంలోనే ఉంటుంది. ఈ ఎఫెక్ట్ క‌డ‌ప జిల్లాలో కూడా గ‌ట్టిగానే ఉంటుంది.

ఇక చిత్తూరుతో పాటు కోస్తాలో ఎలాగూ ప‌వ‌న్ సామాజిక‌వ‌ర్గం అండ‌దండ‌లు పుష్క‌లంగానే ఉంటాయి. ఈ క్ర‌మంల‌నే ప‌వ‌న్ క‌న్ను క‌దిరి మీద ప‌డిన‌ట్టు తెలుస్తోంది. ఇక్క‌డ బ‌ల‌మైన మైనార్టీ ఓట‌ర్లు కూడా ప‌వ‌న్ వైపు మొగ్గు చూపుతున్నార‌ట‌. కాగా, గుంతకల్లులో ఆయనకు బలమైన అభిమాన సంఘం ఉంది. కాబట్టి గుంతకల్లు నుంచి పోటీచేసినా ఆశ్యర్యపోనక్కర్లేదనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. మ‌రి ఫైన‌ల్‌గా ప‌వ‌న్ అనంత‌పురం లేదా క‌దిరి లేదా గుంత‌క‌ల్లులో ఎక్క‌డో ఓ చోట నుంచి పోటీ చేయ‌డం అయితే ఖాయంగానే క‌నిపిస్తోంది.