అగ్రిగోల్డ్ మ్యాట‌ర్‌లో ప‌వ‌న్ క‌న్‌ఫ్యూజ్

ఏపీలో ప్ర‌స్తుతం రాజ‌కీయం అంతా అగ్రిగోల్డ్ వ్య‌వ‌హారం చుట్టూనే తిరుగుతోంది. ఏపీ అసెంబ్లీలో ఈ వ్య‌వ‌హారంపైనే కొద్ది రోజులుగా అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై వార్ జ‌రుగుతోంది. అగ్రిగోల్డ్ మ్యాట‌ర్లో విప‌క్ష వైసీపీ అధికార టీడీపీపై ముప్పేట దాడి చేసింది. మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు కూడా అగ్రిగోల్డ్ భూముల‌ను కొన్నార‌ని వైసీపీ అధినేత జ‌గ‌నే స్వ‌యంగా ఆరోప‌ణ‌లు చేశారు. త‌ర్వాత ఇదే అంశంపై జ‌గ‌న్ స‌వాల్, ప్ర‌త్తిపాటి ప్ర‌తిస‌వాల్‌, చంద్ర‌బాబు జ‌గ‌న్‌కు ఓపెన్ ఛాలెజింగ్ చేసే వ‌ర‌కు మ్యాట‌ర్ వెళ్లింది.

ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది. ఇప్పుడు ఈ మ్యాట‌ర్‌లోకి జ‌న‌సేన కూడా ఎంట‌ర్ అయ్యింది. ఇటీవ‌లే అగ్రిగోల్డ్ బాధితులు పవన్‌ను కలిశారు. తమ బాధలను చెప్పుకోవ‌డంతో ప‌వ‌న్ విజ‌య‌వాడ వ‌చ్చి వాళ్ల‌ను క‌లిశాడు. ఈ మీటింగ్‌కు ఏపీతో పాటు తెలంగాణ నుంచి కూడా చాలా మంది బాధితులు వ‌చ్చారు. వీరి గోడు విన్న ప‌వ‌న్ వారికి ఏం హామీ ఇచ్చాడో ? దీనిపై తాను ఏం చేయ‌ద‌ల‌చుకున్నాడో మాత్రం స‌రిగ్గా క్లారిటీ ఇవ్వ‌లేదు. ప‌వ‌న్ ఇప్ప‌టికే ప్ర‌త్యేక హోదాతో పాటు చాలా అంశాల్లో ప్ర‌భుత్వంపై తాను ఎలా డైరెక్ట్ ఫైట్ చేస్తానో చెప్ప‌ని ప‌వ‌న్ మ‌రోసారి క‌ర్ర‌విర‌గ‌కుండా పాము చావ‌కుండా అన్న చందంగా మాట్లాడాడు.

బాధితుల విష‌యంలో ప్ర‌భుత్వం ఏం చేయాలో..? బాధితులు ప్ర‌భుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారో అడ‌గ‌లేదు. ప్ర‌భుత్వం ఈ విష‌యంలో లేట్ చేయ‌కూడ‌ద‌ని…అగ్రిలోల్డ్ ఆస్తుల‌ను ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకున్నా ఓకే గాని…ప్ర‌భుత్వంలోని వ్య‌క్తులు మాత్రం స్వాధీనం చేసుకుంటే ఊరుకోన‌ని చెప్పారు. ఈ విష‌యం ప‌వ‌న్ కాదు క‌నీస జ్ఞానం ఉన్న ఎవ‌రైనా చెప్ప‌గ‌ల‌రు. ఇక ఈ కేసు ద‌ర్యాప్తు స్పీడ్‌గా జ‌ర‌గ‌డం లేద‌న్న ప‌వ‌న్… ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ఎక్కువగా మాట్లాడనని పవన్ చెప్పారు.

అగ్రిగోల్డ్ ఆస్తులు ఉన్నా ఖాతాదారులకు డబ్బు ఇవ్వడం లేదని, ప్రభుత్వం ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కావడం లేదని పవన్ సందేహం వ్యక్తం చేశారు. ఓవ‌రాల్‌గా అగ్రిగోల్డ్ మ్యాట‌ర్‌లో ప‌వ‌న్ మ‌రోసారి వాళ్ల త‌ర‌పున ప్ర‌భుత్వాన్ని ఎలా నిల‌దీస్తాడో ? ఎంత గ‌ట్టిగా ఫైట్ చేస్తాడో ? మాత్రం చెప్ప‌లేదు. అస‌లు ఈ మ్యాట‌ర్‌లో ప‌వ‌న్ ఎంద‌కు క‌న్‌ఫ్యూజ‌న్‌లో ఉన్నాడో కూడా అర్థం కావ‌డం లేదు.