లోకేశ్ తెలుగు చూసి అవాక్కైన త‌మ్మ‌ళ్లు

ఎట్ట‌కేల‌కు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేశ్ ఎమ్మెల్సీ అయ్యారు. ఇటీవ‌ల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారితో క‌లిపి లోకేశ్ గురువారం ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో లోకేశ్‌తో పాటు మ‌రో ప‌ది మంది ఎమ్మెల్సీలు కూడా ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్సీగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన లోకేష్ ప్ర‌సంగాన్ని చూసిన టీడీపీ నేత‌ల‌కు న‌వ్వు ఆగ‌లేదు. ప‌క్క‌నున్న వారు అయితే షాక్ అయిపోయారు. లోకేష్ ఎమ్మెల్సీగా ఫ‌స్ట్ రోజే ఫెయిల్ అయ్యార‌న్న గుస‌గుస‌లు టీడీపీలోనే వినిపిస్తున్నాయి.

ప్ర‌మాణ‌స్వీకారం చేసేట‌ప్పుడు లోకేశ్ కీల‌క ప‌దాలు కూడా స‌రిగా చ‌ద‌వ‌లేక త‌డ‌బ‌డ్డాడు. సార్వ‌భౌమ‌త్వం అనే ప‌దం ప‌లికేందుకు లోకేశ్ అష్ట‌క‌ష్టాలు ప‌డ్డారు. సార్వ‌భౌ…త‌ర్వాత లోకేశ్ సైలెంట్ అయిపోవ‌డంతో ప‌క్క‌నున్న వారు చెప్ప‌డంతో అతిక‌ష్టం మీద ఆ ప‌దం పూర్తి చేయ‌గ‌లిగారు. ఒక్క సార్వభౌమాధికారమే కాదు… శ్ర‌ద్ధ‌, స్వతంత్రత అన్న ప‌దాలు కూడా ప‌ల‌క‌డానికి ఆయన పడ్డ కష్టం చూస్తే అవాక్కు అవ్వాల్సిందే.

అస‌లే పార్టీకి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, సీఎం కొడుకు..మ‌రి ఎమ్మెల్సీగా ప్ర‌మాణ స్వీకారం చేసేట‌ప్పుడు ఆ ప‌త్రంలో ఏం ఉంటాయో ఓ సారి చూసుకోవాలి క‌దా..! అవ‌న్ని వ‌దిలేసి డైరెక్టుగా మ‌న లోకేశ్‌బాబు ప్ర‌మాణ స్వీకారానికి వ‌చ్చి ప‌దాలు కూడా ప‌ల‌క‌లేక ప‌రువు పోగొట్టుకున్నారు. లోకేశ్ ప్ర‌మాణ‌స్వీకారం చూసిన టీడీపీ సీనియ‌ర్లు లోకేశ్ ఫ‌స్ట్ డే ఫెయిల్ అయ్యాడ‌ని గుస‌గుస‌లాడుకోవ‌డం విశేషం.

చంద్ర‌బాబు లోకేశ్‌కు తెలుగు నేర్పించ‌లేదా..? అని సోష‌ల్ మీడియాలో అప్పుడే గుస‌గుస‌లు స్టార్ట్ అయిపోయాయి. మ‌రి లోకేష్ తెలుగు ప‌దాలు ప‌లికేందుకు అష్ట‌క‌ష్టాలు ప‌డుతూ చేసిన ప్ర‌మాణ‌స్వీకారం వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.