టీ.కాంగ్రెస్‌పై డీకే ఫోకస్..కేసీఆర్‌కు ధీటుగా.!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అధిష్టానం గట్టిగానే ఫోకస్ పెట్టింది. ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో కూడా సత్తా చాటి అధికారంలోకి రావడం అనేది కాంగ్రెస్ ముఖ్యం..అందుకే ముందు అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో విజయం సాధించడం కూడా అంతే ముఖ్యమన్నట్లు పనిచేస్తుంది. తెలంగాణ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో త్వరలోనే ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. సెమీ ఫైనల్స్ మాదిరిగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ చూస్తుంది. ఇదే […]

కాంగ్రెస్‌లోకి వలసల జోరు..కర్నాటక ఫార్ములాతో దూకుడు.!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతుంది. బి‌ఆర్‌ఎస్, బి‌జే‌పిలకు చెందిన కీలక నేతలు వరుసపెట్టి కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇప్పటికే చాలామంది నేతలు కాంగ్రెస్ లోకి వచ్చారు. ఇదే క్రమంలో తాజాగా మరికొందరు కాంగ్రెస్ లోకి వస్తున్నారు. గద్వాల జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత కాంగ్రెస్ లో చేరుతున్నారు. అటు తీగల కృష్ణారెడ్డి తాజాగా రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. అలాగే ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఆయన తనయుడు, ఇంకా పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నేతలు […]

టీ పీసీసీ రేసులో ముగ్గురు హేమాహేమీలు!

తెలంగాణ కాంగ్రెస్ సార‌ధి మార‌నున్నారా? ప‌్ర‌స్తుత టీ పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ ప‌నిత‌నంపై కాంగ్రెస్ అధిష్టానం అసంతృప్తిగా ఉందా? ఆయ‌న‌ను మార్చి.. కాయ‌క‌ల్ప చికిత్స చేస్తేనే పార్టీ కి 2019లో మ‌నుగ‌డ ఉంటుంద‌ని భావిస్తోందా? అంటే ఔన‌నే ఆన్స‌రే వినిపిస్తోంది. టీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆక‌ర్ష్ తో కాంగ్రెస్‌కి చెందిన హేమా హేమీలు హ‌స్తానికి చెయ్యిచ్చి పార్టీ కండువాలు మార్చేశారు. ఈ క్ర‌మంలో స‌మ‌ర్ధంగా వ్య‌వ‌హ‌రించి వాళ్ల‌ని పార్టీ మార‌కుండా నిల‌వ‌రించే య‌త్నం […]

టీ కాంగ్రెస్‌లో స‌డెన్‌గా ఇంత మార్పు ఏంటో

పాలిటిక్స్‌లో ఎప్పుడు ఎలాంటి మార్పులు వ‌స్తాయో? ఎప్పుడు నేత‌లు ఎలా మార‌తారో చెప్ప‌డం క‌ష్టం! ఇప్పుడు ఇదంతా ఎందుకనుకుంటున్నారా?  తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు ఇలాంటి మార్పులే జ‌రుగుతున్నాయి మ‌రి! అందుకే ఈ స్టోరీ. టీ కాంగ్రెస్‌లో నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఒక‌రి ముఖాలు ఒక‌రు చూసుకునేందుకు సైతం సీనియ‌ర్ నేత‌లు త‌ప్పించుకుని తిరిగారు. ఇక‌, మూకుమ్మ‌డిగా అధికార పార్టీ టీఆర్ ఎస్ స‌హా సీఎం కేసీఆర్‌పై విమ‌ర్శ‌ల దండ‌యాత్ర చేద్దామ‌న్నా క‌లిసొచ్చిన నేత క‌రువ‌య్యాడు. అలాంటి ప‌రిస్థితి […]

కెసిఆర్ కి సవాల్ విసిరిన డీకే అరుణ

తెలంగాణ లో తెరాస గవర్నమెంట్ జిల్లాల విభజన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అశాస్త్రీయంగా ఉందని పేర్కొంటూ శనివారం ఇందిరాపార్క్ వద్ద రెండు రోజులు నిరాహార దీక్షను పొన్నాల లక్ష్మయ్య, డీకే అరుణ చేపట్టారు. ఈ ధీక్షలో కాంగ్రెస్ పార్టీ నేత డీకే అరుణ ముఖ్యమంత్రి కేసీఆర్కు సవాల్ విసిరారు. తాను రేపు సాయంత్రం వరకు దీక్షలోనే ఉంటానని, జిల్లాల విభజనపై బహిరంగ చర్చకు రావాలని సవాల్లో డిమాండ్ చేశారు. ఈ […]

రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టిన కెసిఆర్!

మహా ఒప్పందంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను మహారాష్ట్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టే చెత్త ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నామని ఏఐసీసీ అధికార ప్రతినిధి మధు యాష్కీ అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కవితలు కమీషన్ల కోసం డిజైన్లు మార్చారని ఆరోపించారు. వీరంతా జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. భూ నిర్వాసితులకు భూసేకరణ చట్టం-2013 ప్రకారం పునరావాసం కల్పించాలనిడిమాండ్ చేశారు. జీఓ 123 ప్రకారం భూసేకరణ చెల్లదని కోర్టు తీర్పు ఇచ్చినా టీఆర్‌ఎస్ […]

కేసీఆర్‌కి పవర్‌ పాయింట్‌ దెబ్బ

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకి తెలంగాణలోని నీటి ప్రాజెక్టులపై కాంగ్రెసు పార్టీ ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ పెద్ద ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యమ సంస్థలను ఆహ్వానించి తెలంగాణ కాంగ్రెసు నాయకులు ఈ పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న విషయాలన్నీ అవాస్తవాలేనని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమే. కానీ గడచిన రెండేళ్ళలో తెలంగాణలోని కెసియార్‌ ప్రభుత్వం సాధించినదేమీ లేదని కాంగ్రెసు […]

కాంగ్రెసోళ్ళూ సినిమా చూపించారు

తెలంగాణలో నీటి ప్రాజెక్టులపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌ అసెంబ్లీలో పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇస్తే, దాన్ని కాంగ్రెస్‌ వ్యతిరేకించింది. వాస్తవాల్ని దాచిపెట్టి, కెసియార్‌ ఉత్త సినిమా చూపించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి కాంగ్రెసుతోపాటు ఇతర విపక్షాల నుంచి. వాస్తవాలతో కూడిన పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ మేం ఇస్తామని కాంగ్రెసు ఎంతో హడావిడి చేసినా, ఆలస్యం చేయడంతో కాంగ్రెసు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే సొంత పార్టీపై అసహనంతో ఊగిపోయారు. వారిలో కొందరు, కాంగ్రెసుని వీడి, టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు కూడా. అయితే తీరికగా […]

టీ కాంగ్రెస్ లో కోవర్టులు వున్నారా ?

అస‌లు తెలంగాణ‌ కాంగ్రెస్ పార్టీలో కోవ‌ర్టులు ఉన్నారా, ఈకోవ‌ర్టుల‌తో పార్టీకి న‌ష్టం జ‌రుగుతుందంటారా, ప్రస్తుత ప‌రిణామాలు చూస్తుంటే ఔన‌న్పిస్తోంది. కాంగ్రెస్ పెద్ద‌లు మాత్రం కోవ‌ర్ట‌ల‌తో పార్టీకీ తీవ్ర న‌ష్టం జ‌రుగుతంద‌ని, దీనిపై అధిష్టానం చోర‌వ తీసుకోవాల‌ని, లేకుంటే తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ఖాతా క్లోజ్ ఆవుతుంద‌ని టీకాంగ్రెస్ లో కొంత‌మంది పెద్ద‌ల అధిష్టానం ముందు వాద‌న‌లు విన్పిస్తున్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి130ఏళ్ల రాజ‌కీయ‌ చ‌రిత్ర ఉందని, ఏంతోమంది నాయ‌కులను త‌యారు చేసింద‌ని, కాంగ్రెస్ పార్టీ స‌ముద్రం లాంటిద‌ని […]