కెసిఆర్ కి సవాల్ విసిరిన డీకే అరుణ

తెలంగాణ లో తెరాస గవర్నమెంట్ జిల్లాల విభజన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అశాస్త్రీయంగా ఉందని పేర్కొంటూ శనివారం ఇందిరాపార్క్ వద్ద రెండు రోజులు నిరాహార దీక్షను పొన్నాల లక్ష్మయ్య, డీకే అరుణ చేపట్టారు. ఈ ధీక్షలో కాంగ్రెస్ పార్టీ నేత డీకే అరుణ ముఖ్యమంత్రి కేసీఆర్కు సవాల్ విసిరారు. తాను రేపు సాయంత్రం వరకు దీక్షలోనే ఉంటానని, జిల్లాల విభజనపై బహిరంగ చర్చకు రావాలని సవాల్లో డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాల విభజన అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎవరైనా సరే చర్చకు రావొచ్చని అన్నారు. ఏయే ప్రాతిపదికన జిల్లాల విభజన చేస్తున్నారో చెప్పాలన్నారు. జిల్లాల విభజన శాస్త్రీయంగా జరుగుతుందని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష భేటీలో ముసాయిదాను ఏ పార్టీలూ ఆమోదించలేదని చెప్పారు.