బాలయ్య ఓవర్శిస్ లో సంచలనం

గౌతమి పుత్ర శాతకర్ణి  ఈ సినిమా హీరో డైరెక్టర్ ల కంబినేషనే ఒక సంచలనం పౌరాణిక పాత్రలు పోషించడంలో బాలయ్య దిట్ట, సమాజాన్ని ప్రేరేపించగల సినిమాలు తీయడంలో పేరొందిన దర్శకుడు క్రిష్. ఈ కలయిక అనగానే సినీ ప్రేక్షకులలో ఎక్సపెక్టషన్స్ భారీస్థాయిలో వున్నాయి.  ఈ కలయికలో ఓ హిస్టోరికల్ మూవీ అంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ముఖ్యంగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ బాలయ్య 100వ సినిమా కావడంతో అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయి. గౌతమీపుత్ర శాతకర్ణి షూటింగ్ మెదలయినప్పటి నుంచి  రోజుకోవార్త హల్‌చల్ చేస్తోంది. ఇప్పుడు సరికొత్తగా ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు 5 కోట్ల రూపాయిలకు అమ్ముడుబోయినట్టు సమాచారం.

ఇంతకుముందెప్పుడు బాలయ్య సినిమాకి ఈ రేంజ్ లో బిజినెస్ జరగలేదు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా రిలీజ్ కాకముందే బాలకృష్ణ ఇలాంటి రికార్ట్స్ బ్రేక్ చేస్తుంటే..సినిమా రిలీజ్ అయ్యాక ఇంకెన్ని రికార్ట్స్ తన ఖాతాలో వేసుకుంటాడో వేచి చూడాలి.