బెట్టు చేస్తే బొక్కే… టీడీపీ – జ‌న‌సేన‌తో పొత్తుపై బీజేపీ ట్విస్ట్ ఇచ్చేసింది…!

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి రాష్ట్రంలో పొత్తులు పొడిచేందుకు రంగం సిద్ధ‌మైంది. టీడీపీ-జ‌న‌సేన‌లు పొత్తు దిశ‌గా స‌మాలోచ‌న‌లు చేస్తున్నాయ‌నే వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. అయితే.. టీడీపీతో క‌లిసి ప‌నిచే సేందుకు.. బీజేపీ స‌సేమిరా అంటోంది. గ‌తంలో మోడీని చంద్ర‌బాబు అవ‌మానించార‌ని.. ఆయ‌నకు వ్య‌తిరేకంగా.. పార్ల‌మెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టార‌ని.. కుటుంబం లేని వారికి మ‌హిళ‌ల విలువ ఏం తెలుస్తుందంటూ..వ్యాఖ్యానించార‌ని.. అలాంటి పార్టీతో పొత్తుకు తాము ఎలా ముందుకు వ‌స్తామ‌ని.. పార్టీ నేత‌లు చెబుతున్నారు. ఈ విష‌యంలో ఓ వ‌ర్గం […]

ఏపీ విభజనపై మోడీ మళ్లీ కీలక వ్యాఖ్యలు .

ఈ రోజు రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ పునర్వవిభజన జరిగిన తీరున ప్రధానమంత్రి మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు .రాష్ట్ర విభజన సరిగా జరగలేదని దాని వలన రెండు రాష్ట్రలో ఇంకా గొడవలు జరుగుతున్నాయి అని చెప్పారు .మరొక సారి కాంగ్రెస్ పార్టీ పై అయన విరుచుకుపడ్డారు. మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వెతిరేకం కాదు .వాజ్ పేయి మూడు రాష్ట్రాలు విభజించారు .శాంతి యుతంగా కూర్చుని అన్ని చర్చించి ఆ […]

ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడి రేసులో వీళ్లే!

సోమువీర్రాజు.. చాలా పంతం పట్టి మరీ.. ఏపీ బీజేపీ పగ్గాలను అందింపుచ్చుకున్నారు. పార్టీ మీద అలిగి, కోపం వ్యక్తం చేసిన తర్వాత గానీ.. ఆయనకు అధ్యక్ష పీఠం దక్కలేదు. అయితే.. అంత కష్టపడి దక్కించుకున్న పార్టీ పదవికి త్వరలోనే ఎండ్ కార్డు పడబోతోంది. చీప్ లిక్కర్ వ్యవహారం ఆయన పదవికి ఎసరు పెట్టింది. ఇప్పటికే ఆయన మీద గుస్సా అయిన అధిష్ఠానం అనధికారికంగా సంజాయిషీ అడిగినట్టు తెలుస్తోంది. కాగా.. సోము వీర్రాజు పదవీకాలం సుమారుగా మరో ఆరునెలల […]

నాడొక మాట.. నేడొక మాట.. దటీజ్ బాబు

40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు ఎందుకో ప్రజల విశ్వాసం పొందలేకపోయాడు. ఎన్నికల్లో గెలిచాడు.. సీఎంగా చేశాడు అనే విషయాలు పక్కన పెడితే అప్పట్లో ప్రత్యామ్నాయం ప్రజలకు లేకపోయింది కాబట్టి సీఎం సీటులో కూర్చున్నాడు. అంతే.. ఆయనకేం పెద్ద ఫాలోయింగ్ లేదు..కనుసైగ చేస్తే కదలి వచ్చే కార్యకర్తలు లేరు.. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఒక మాట మీద ఉండడు.. ఒకరిని నమ్మడు.. అందుకే ఆయన పరిస్థితి ఇపుడలా తయారైంది. ఈ మాజీ సీఎం శనివారం (ఈరోజు) […]

ఇదేం చోద్యం.. మా పథకాలకు మీపేర్లేంటి?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీకి చెందిన నాయకుల పేర్లు సంక్షేమ పథకాలకు పెట్టడం సాధారణమే. అనేక సంవత్సరాలుగా ఈ సంస్కృతి కొనసాగుతోంది. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు చంద్రన్న బీమా, పసుపు..కుంకుమ లాంటి పథకాలు ప్రవేశపెడితే వైఎస్‌ఆర్‌ అధికారంలో ఉన్నపుడు రాజీవ్‌ గృహకల్ప, ఇందిరమ్మ ఇళ్లు లాంటి పేర్లుపెట్టారు. ఇప్పుడు వైఎస్‌పీ అధికారంలో ఉంది. అందుకే అక్కడ వైఎస్‌ఆర్‌పేరు లేదా జగన్‌ పేరుతో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. దాదాపు అన్ని పథకాలు ఈ […]

మోదీని కలవాలనుంది…!

ఏపీ ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బీజేపీ అధిష్టానానికి దగ్గర కావాలనుకుంటున్నాడా? వచ్చే ఎన్నికల్లో కమలం పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నాడా?.. ఇటీవల జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అవుననే సమాధానం చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. ఏపీలో జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం పార్టీ తన ప్రాభవం కోల్పోయిందనే చెప్పవచ్చు. పలువురు నాయకులు తెలుగుదేశం నుంచి బీజేపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. జగన్‌ పార్టీ పవర్‌లోకి వచ్చిన […]

యూపీలో ‘పవర్‌’ పాలిటిక్స్‌

ఉత్తర ప్రదేశ్‌లో 2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఎవ్వరూ ఊహించని విధంగా యోగీ ఆదిత్యనాథ్‌ సీఎం అయ్యారు. మోదీ, అమిత్‌ ఆశించినట్లే యోగి యూపీలో చక్రం తిప్పుతున్నాడు. వచ్చే సంవత్సరం యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అధికార పీఠం కోసం అధికారపార్టీతోపాటు కాంగ్రెస్‌ పార్టీ కూడా పక్కా ప్లాన్‌ రూపొందించుకుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ యూపీకి పలుసార్లు వెళ్లి వచ్చారు. అధికార కార్యక్రమాలే అయినా పార్టీ శ్రేణుల్లో ఆయన పర్యటన జోష్‌ […]

మోదీసాబ్‌.. అప్పుడూ అంతే.. ఇప్పుడూ అంతే..

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతూ దేశాన్ని నడిపిస్తున్న నరేంద్ర మోదీ తాను అనుకున్నది అనుకున్నట్లు కచ్చితంగా అమలు చేసి తీరతారు. ప్లాన్‌ పకడ్బందీగా ఎగ్జిక్యూట్‌ చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఎందుకంటే మోదీ ఆలోచనలకు అనుగుణంగా పనిచేసే పెద్దటీమ్‌ ఉంది. మోదీకి ఏదైనా ఆలోచన వస్తే చాలు.. దాని అమలుకు ఈ టీమ్‌ సర్వశక్తులు వడ్డుతుంది. సోషల్‌ మీడియాలోనూ అంతే.. మోదీ ఫాలోయింగ్‌ను ఈ టీమ్‌ ఓ రేంజ్‌లో పెంచుతుంది. ఇటీవల కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ […]

చిన్న బ్రేక్ తర్వాత.. కేసీఆర్ రణమే

‘ధాన్యం కొనుగోలు’ అనే పాయింట్ మీద ఒక రాష్ట్రముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని అడగడమే చాలా పెద్ద సంగతి. అయితే.. ఒకవేళ చిన్న సంగతే అయినా కూడా చాలా పెద్దగా హడావుడి చేయాలని ఫిక్సయిపోయిన కేసీఆర్.. స్వయంగా మంత్రులనుకూడా వెంట బెట్టుకుని ఢిల్లీ వెళ్లారు. ఉత్తి చేతులతోనే తిరిగొచ్చారు. అయితే గమనించాల్సింది ఏంటంటే.. ఇక్కడితో ఎపిసోడ్ అయిపోలేదు. ఇది చిన్న కమర్షియల్ బ్రేక్ మాత్రమా.. తర్వాత.. అసలు సినిమా ఉందని అనిపిస్తోంది. మూడురోజులుగా ఢిల్లీలోనే తిష్టవేసి అడుగుతూ […]