40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు ఎందుకో ప్రజల విశ్వాసం పొందలేకపోయాడు. ఎన్నికల్లో గెలిచాడు.. సీఎంగా చేశాడు అనే విషయాలు పక్కన పెడితే అప్పట్లో ప్రత్యామ్నాయం ప్రజలకు లేకపోయింది కాబట్టి సీఎం సీటులో కూర్చున్నాడు. అంతే.. ఆయనకేం పెద్ద ఫాలోయింగ్ లేదు..కనుసైగ చేస్తే కదలి వచ్చే కార్యకర్తలు లేరు.. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఒక మాట మీద ఉండడు.. ఒకరిని నమ్మడు.. అందుకే ఆయన పరిస్థితి ఇపుడలా తయారైంది. ఈ మాజీ సీఎం శనివారం (ఈరోజు) మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడాడు. ఆయన మాటలు విన్న మీడియా ప్రతినిధులు ఒక్క సారిగా షాక్ తిన్నారు. ‘‘ప్రత్యేక హోదాపై మీరు స్పందించడం లేదు.. ఆ సమస్య పరిష్కారానికి మేము రాజీనామాకు సిద్ధం’’ అని పేర్కొన్నాడు.
అరె.. చంద్రబాబు నోటి వెంట ప్రత్యేక హోదా అనే పదం ఎందుకొచ్చింది అని మీడియా వాళ్లే గుసగుసలాడుకున్నారు. ఎందుకంటే ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ విడిపోయిన తరువాత సీఎంగా పనిచేసిన ఆయన.. హోదా గురించి మరచిపోయారు. ప్రత్యేక హోదా లేదు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని మోదీ చెబితే గంగిరెద్దులా తలూపారు. హోదా కాదు.. ప్యాకేజీ తీసుకుందాం అని అందరినీ నట్టేట ముంచాడు. ఆ తరువాత ప్రత్యేక హోదా నినాదం మీద జగన్ ఎన్నికలకు వెళ్లి సీఎంసీటులో కూర్చున్నాడు. ఇపుడు మళ్లీ బాబు నోటి వెంట హోదా మాట వస్తోంది. మొదట్లో హోదా వద్దన్నాడు.. ప్యాకేజీ ముద్దన్నాడు.. ఎన్నికల్లో జనం బుద్ది చెప్పిన తరువాత మళ్లీ హోదా రాగం అందుకుంటున్నాడు. ఒకే మనిషి.. కాలానుగుణంగా మాట మారిస్తే రాజకీయాల్లో ఉండవచ్చు గానీ విశ్వసనీయత ఎలా ఉంటుంది? అతనిని ఎలా నమ్ముతారు? కనీసం ఈ తెలివి కూడా చంద్రబాబుకు లేదా అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వైసీపీ నాయకులు హోదా గురించి ఏం చేశారని ఆయన ప్రశ్నిస్తున్నాడు. సరే.. వారు పోరాటం చేశారా, లేదా అనేది కాదు.. ముందు మన నాలుకకేం అయింది? ఎందుకలా మాట్లాడుతోంది? జనం ఏమనుకుంటారు అని కూడా ఆలోచించరా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏం చేస్తాం.. బాబుగారంతే… రాజకీయ నాయకులు జనం సెంటిమంట్ ను వాడుకొని పవర్ లోకి రావాలనుకుంటారు.అయితే జనం మాత్రం మీ మాటలు గమనిస్తున్నారనే విషయం మరవొద్దు.