బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 మొత్తం 19 మంది కంటెస్టెంట్లతో 5 సెప్టెంబర్ 2021న అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ షో చివరి దశకు చేరుకుంది. సరయు, ఉమా దేవి, లహరి, నట్రాజ్ మాస్టర్, హమీద, శ్వేత వర్మ, ప్రియ, లోబో, విశ్వ, జెస్సీ, యానీ మాస్టర్, యాంకర్ రవి, ప్రియంకా, కాజల్ ఇలా వరసగా ఎనిమినేట్ అవ్వగా.. ఆఖరికి మానస్, శ్రీరామ్, షణ్ముఖ్ జశ్వంత్, సన్నీ, సిరిలు ఫినాలేలో అడుగు పెట్టారు.
డిసెంబర్ 19న బిగ్ బాస్ సీజన్ 5 ఫైనల్ ఎపిసోడ్ జరగబోతుంది. ప్రస్తుతం నిర్వాహకులు అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి గత సీజన్ కు ముఖ్య అతిథిగా వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి ఎవరు గెస్ట్లుగా వస్తారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం.. బిగ్‌బాస్ నిర్వాహకులు ఫినాలే ఎపిసోడ్ కోసం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ ప్రముఖులను కూడా రంగంలోకి దింపుతున్నారట.
బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనేలతో పాటు స్టార్ కిడ్ అలియా భట్‌ను సైతం గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథులుగా తీసుకువచ్చేందుకు సంప్రదింపులు జరుపుతున్నారట. అలాగే టాలీవుడ్ నుంచీ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, సైలిష్ స్టార్ అల్లు అర్జున్‌లు ఈ సారి ఫినాలే ఎపిసోడ్లో సందడి చేయనున్నారని తెలుస్తోంది.
మరి ఇందులో ఎంత వరకు నిజమో తెలియాలంటే మరో వారం రోజుల పాల వెయిట్ చేయాల్సిందే. కాగా, బిగ్‌బాస్ సీజన్ 5 ట్రోపీని గెలుచుకోబోయే విన్నర్‌కు రూ.50 లక్షలు ప్రైస్ మనీతో పాటుగా సొంత ఇంటిని కట్టుకునేందుకు షాద్‌నగర్‌లోని సువర్ణ కుటీర్‌లో రూ.25 లక్షల విలువ చేసే 300 చదరపు గజాల స్థలాన్ని సైతం ఇవ్వబోతున్నారు.