చిన్న బ్రేక్ తర్వాత.. కేసీఆర్ రణమే

‘ధాన్యం కొనుగోలు’ అనే పాయింట్ మీద ఒక రాష్ట్రముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి కేంద్రాన్ని అడగడమే చాలా పెద్ద సంగతి. అయితే.. ఒకవేళ చిన్న సంగతే అయినా కూడా చాలా పెద్దగా హడావుడి చేయాలని ఫిక్సయిపోయిన కేసీఆర్.. స్వయంగా మంత్రులనుకూడా వెంట బెట్టుకుని ఢిల్లీ వెళ్లారు. ఉత్తి చేతులతోనే తిరిగొచ్చారు. అయితే గమనించాల్సింది ఏంటంటే.. ఇక్కడితో ఎపిసోడ్ అయిపోలేదు. ఇది చిన్న కమర్షియల్ బ్రేక్ మాత్రమా.. తర్వాత.. అసలు సినిమా ఉందని అనిపిస్తోంది. మూడురోజులుగా ఢిల్లీలోనే తిష్టవేసి అడుగుతూ […]

కమలం.. ఇక కుల సమీకరణలు..

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఊహించని విజయం.. అసెంబ్లీలో ఇప్పటికే ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు.. రాష్ట్రంలో పట్టు పెంచుకునే యత్నం.. అధికారంలోకి కాకపోయినా కనీసం 30..40 నియోజకవర్గాల్లో విజయం సాధించాలని టీబీజేపీ నాయకులు ప్లాన్ రూపొందిస్తున్నారు. వారికి హై కమాండ్ కూడా ఫుల్ సపోర్టు ఉంది. బండి సంజయ్ దూసుకుపోతున్నాడు. దీంతో పొలిటికల్ లీటర్లు కులసమీకరణలపై ద్రుష్టి సారించారు. ముఖ్యంగా మున్నూరుకాపు, ముదిరాజ్, రెడ్డి, ఎస్టీల ఓట్లు రాబట్టుకునేందుకు, వారి మద్దతు కూడబెట్టేందుకు అడుగులు వేస్తున్నారు. 2023 ఎన్నికలే […]

సారు.. వచ్చేశారు సిటీకి

నాలుగు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర రాజధానికి వచ్చేశారు. గురువారం సాయంత్రం ఢిల్లీ నుంచి విమానంలో సిటీలో ల్యాండ్ అయ్యారు. వరి సమస్యపై మోదీతోపాటు కేంద్ర మంత్రులను కలుస్తామని ప్రజలకు చెప్పి తన టీమ్ తో హస్తినకు వెళ్లిన కేసీఆర్ కు అక్కడ ఎవరి దర్శనమూ కాలేదు. ఎంత ప్రయత్నించినా మోదీని కలిసే అవకాశం రాలేదు. దీంతో అక్కడే ఉండి చేసేది లేక తిరిగొచ్చేశారు. విచిత్రమేమంటే నాలుగు రోజుల పాటు ఒక […]

మూడు రోజులైంది.. ఇంకా ఎవ్వరినీ కలవలే..

‘‘మోదీ ప్రభుత్వం తెలంగాణను చిన్నచూపు చూస్తోంది.. రైతులను పట్టించుకోవడం లేదు.. అరె.. వరి కొంటారో, కొనరా చెప్పండయ్యా అంటే సమాధానం లేదు.. ఈ లొల్లేంది.. ఢిల్లీకి పోతాం.. అక్కడే తేల్చుకుంటాం’’ అని ధర్నా చౌకలో కేసీఆర్ మాట్లాడిన మాటలు ఇంకా చెవుల్లో మార్మోగుతున్నాయి. శభాష్.. సారు రైతుల కోసం ఎంతకైనా తెగిస్తాడు.. అన్నదాతకు మేలు జరుగుతుందని అందరూ సంతోషపడ్డారు. సారు చెప్పినట్లుగానే తన టీమ్ తో ఆదివారం ఢిల్లీకి బయలుదేరాడు. అంతే.. పోయి ఇంట్లో కూసున్నడు. ఇప్పటికి […]

యూపీలో ‘మూడు’ ముక్కలాట

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఉత్తర ప్రదేశ్ పై ప్రత్యేకంగా ద్రుష్టి సారించారు. ఆల్రెడీ అక్కడ బీజేపీ అధికారంలో ఉంది. యోగి ఆదిత్యనాథ్ హైకమాండ్ ఆదేశాల మేరకు పాలన సాగిస్తున్నారు. యోగి పాలనపై పెద్దగా వ్యతిరేకత లేదు.. అయితే సీట్లు మాత్రం తగ్గే అవకాశముందని సర్వేలు చెబుతున్నాయి. దీంతో డిల్లీలోని కమలం గ్యాంగ్ అప్రమత్తం అయింది. అరె.. యూపీలో ఓట్లు తగ్గినా.. అనుకున్న సీట్లు రాకపోయినా.. పొరపాటున అధికారం చేజారినా దేశవ్యాప్తంగా మోదీ పరువు గంగలో కలిసిపోతుందని […]

మోదీపై సమర శంఖం పూరించిన కేసీఆర్‌

తెలంగాణలో మరో ఉద్యమం మొదలైంది.. అదే రైతు ఉద్యమం.. దీనికి కేసీఆరే నేతృత్వం వహిస్తున్నారు. ఉద్యమ నాయకుడిగా పేరున్న కేసీఆర్‌ తెలంగాణ కోసం ఏళ్ల తరబడి కొట్లాడాడు.. నిరసన చేశాడు.. ధర్నాలు, దీక్షలు.. ఆమరణ నిరాహార దీక్ష..ఇలా ఎన్నో..ఎన్నెన్నో.. ఇన్ని నిరసన కార్యక్రమాలుచేసి.. అనేకమంది ప్రాణాలు కోల్పోయిన తరువాత ప్రత్యేక తెలంగాణ వచ్చింది.. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వమని ఆ పార్టీ నాయకులు చెబుతున్నా క్రెడిట్‌ మాత్రం కేసీఆర్‌కే దక్కుతుంది. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో […]

’బండి‘కి బ్రేకులు వేయలేకపోతున్న ’కారు‘

భారతీయ జనతా పార్టీ.. ఎప్పుడూ ఉత్తర భారతదేశంలోనే దీని హవా.. దక్షిణాదిలో కేవలం కర్ణాటకలో మాత్రమే.. ఇది గతం.. ఇప్పుడు సౌత్ లో తెలంగాణలో దూసుకుపోతోంది. ఎప్పుడూ మూడో స్థానంలో ఉండే బీజేపీ ఇపుడు అధికార పార్టీకి ఏకుమేకై కూర్చుంది. గతంలో అధికార పార్టీ తరువాత కాంగ్రెస్ మాటలు వినిపించేవి. ఇపుడు బీజేపీకి ఆ అవకాశం దక్కింది. అందుకు నిదర్శనమే సీఎం కేసీఆర్ మీడియా సమావేశం. రాష్ట్రంలో ఉన్నది కేవలం తమ పార్టీనేనని గొప్పలు చెప్పుకునే కేసీఆర్ […]

దేశరాజధాని వైపు కదులుతున్న కేసీఆర్ కారు

రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధినేత కేంద్ర ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా టీబీజేపీ నాయకుల తీరుకు ఆయన విసిగి వేసారి పోయారు. ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లి మేదీ అండ్ టీమ్ ను కలిసి వివరించినా పరిస్థితుల్లో పెద్ద మార్పులేమీ లేవు.. పైగా ఇష్టానుసారం మాట్లాడటం.. అందుకే ఢిల్లీ వెళ్లి తేల్చుకుందాం అని అనుకుంటున్నారు పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు. తెలంగాణ వచ్చిన తరువాత సీఎంగా బీజీ అయిన ఈ ఉద్యమ నాయకుడు […]

కేసీఆర్.. ఒక ధీరోదాత్తుడి ధిక్కారం!

కేంద్ర ప్రభుత్వంలో ప్రధాని నరేంద్రమోడీతో సమానంగా చక్రం తిప్పుతున్న హోం మంత్రి అమిత్ షా తిరుపతికి వచ్చి.. తన ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం నిర్వహించారు. దక్షిణాది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ముఖ్యమంత్రులు హాజరు కావాల్సిన స్థాయి సమావేశం అది. అత్యున్నత స్థాయి సమావేశం. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం హాజరు కాలేదు. ఆయన హాజరు కాదలచుకోలేదు. ఆ రకంగా.. రాష్ట్రాల అధికారాలకు కత్తెర వేసే ఆలోచనలతో నిత్యం పెట్రేగుతూ ఉండే.. […]