సెల్ఫ్ డిఫెన్స్ లో ఏపీ సీఎం

ముఖ్యమంత్రి చంద్రబాబునాయడును ఒక్కసారిగా సమస్యలు కమ్ముకుంటున్నాయి. ఎదురవుతున్న అన్నీ సమస్యలనూ తానే చూసుకోవాల్సి రావటంతో సిఎం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఒకవైపు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కేంద్రంగా ఉభయగోదావరిలో ఉద్రిక్తత. మరోవైపు ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వరుసపెట్టి మాటల దాడులు. ప్రధాన ప్రతిపక్షానికి చెందిన పలువురు ఎంఎల్ఏలు ఆరోపణలు, విమర్శలు, ఇంకోవైపు హైదరాబాద్‌లోని సచివాలయం నుండి విజయవాడ ప్రాంతానికి తరలి రావటానికి ఇష్టపడని ఉద్యోగులు. ఇన్ని సమస్యల మద్య చంద్రబాబు ఉక్కిరి […]

జగన్ ఆస్తులపై కన్నేసిన చంద్రబాబు!!

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఆస్తుల్ని ‘అటాచ్‌’ చేసిన సందర్భంలో, ఆ ఆస్తుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై అక్రమాస్తుల కేసు నడుస్తోంది. ఈ కేసుకు సంబంధించి పలు ఆస్తుల్ని ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ‘అటాచ్‌’ చేసింది కూడా. ఆ ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే న్యాయపరమైన చిక్కులు తలెత్తవచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు. ఎలాంటి సమస్యలూ రాకుండా ప్రత్యేక చట్టం ద్వారా […]

జగన్‌ కంచుకోటలో చంద్రబాబు పాగా !

కడప జిల్లా అంటే వైఎస్‌ జగన్‌ కంచుకోటగా రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంటుంది. చిత్తూరు జిల్లాని చంద్రబాబు సొంత జిల్లా అనడం అరుదుగానే జరుగుతుంటుంది గానీ, రాజకీయంగా స్వర్గీయ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కడప జిల్లాను తన కంచుకోటగా మలుచుకున్నారు. రాజశేఖర్‌రెడ్డి తర్వాత కడప జిల్లాలో తన పట్టుని నిలబెట్టుకుంటూ వస్తున్న వైఎస్‌ జగన్‌కి షాక్‌ ఇచ్చేందుకోసం టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు, కడప జిల్లాలో మహా సంకల్ప సభను నిర్వహించారు. కడప జిల్లాలో ఈ దీక్ష కోసం పార్టీ […]

డిప్యూటీ సీఎం రేసులో నారా లోకేష్‌ !

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి వర్గంలోకి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేరతారని వినవస్తున్న ఊహాగానాలకు సంబంధించి లేటెస్ట్‌ డెవలప్‌మెంట్‌ ఏమిటంటే, ఏదో ఒక మంత్రి పదవి కాకుండా డిప్యూటీ సీఎం పదవిని తన కుమారుడికి కట్టబెడితే ఎలా ఉంటుందని చంద్రబాబు ఆలోచిస్తున్నారట. అయితే తన కుమారుడ్ని మంత్రి వర్గంలోకి తీసుకోవడంపై చంద్రబాబు ఇప్పటివరకు ఎటువంటి స్పష్టతా ఇవ్వలేదు. ఏప్రియల్‌ లేదా మే నెలల్లో చంద్రబాబు మంత్రి వర్గ విస్తరణ చేపట్టవచ్చునని టిడిపి వర్గాలు భావించాయి. అయితే […]