జనాలకి ఎరుపుకలలు చూపించిన బాబు కేసీర్

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వద్దన్నవే ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ముద్దు అవుతున్నవిచిత్రం తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. తెలంగాణలో టిఆర్ఎస్, ఏపిలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరినయితే వ్యతిరేకించాయో, ఇప్పుడు ఆ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చిన తరువాత అవే కంపెనీలు దర్జాగా రెండు రాష్ట్రాల్లోనూ వెలిగిపోతున్న వైనం రెండుపార్టీల నేతల్లోనూ విస్మయానికి గురిచేస్తోంది. తెలంగాణ ప్రాజెక్టుల పనులన్నీ ఆంధ్రా పెట్టుబడిదారులకే అప్పగించి, సీమాంధ్ర పాలకులు తెలంగాణను దోపిడికి గురి చేస్తున్నారని, తెరాస ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించింది. ఎన్నికల తర్వాత […]

చంద్రన్నా ఏంది నీ తొందర

ఆంధ్రప్రదేశ్‌ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నమాట వాస్తవం. ఆర్థిక సమస్యలతో ఆంధ్రప్రదేశ్‌ సతమతమవుతోంది. రాజధాని నిర్మించుకోవడం ఆంధ్రప్రదేశ్‌ ముందున్న తక్షణ కర్తవ్యం. కానీ అది శక్తికి మించిన పని. అయినా తప్పదు, రాజధానిని నిర్మించుకోవాల్సిందే. ఇంకో వైపున ముఖ్యమంత్రి చంద్రబాబు నేను నిద్రాహారాలు మాని కష్టపడుతున్న అని ఎంత మొత్తుకున్నా ఏ పనీ సకాలంలో పూర్తి కావడంలేదు. ఆంధ్రప్రదేశ్‌కి అపారమైన వనరులన్నాయి, అలాగే అపాయాలు కూడా ఉన్నాయి. ప్రకృతే ఆంధ్రప్రదేశ్‌కి బలం, బలహీనత. సముద్ర తీరం ఎంత అందమైనదో, […]

గుడి కొట్టు-అభివృద్ధి సోట్టు:చంద్రోపదేశం

ఎక్కడైనా తుఫానుకి ముందు ఏదయినా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటే జరిగే నష్టాన్నై తగ్గించవచ్చు.తుఫాను బీభత్సం సృష్టించేసాక అందరూ ధైర్యంగా ఉండండి,ఇలాంటప్పుడే గుండె నిబ్బరం చేసుకోవాలి లాంటి సూక్తులు ఎందుకు పనికొచ్చేవి?సరిగ్గా ఇలాగే ఉంది విజయవాడలో గుళ్ళు కూల్చివేతపై మన చంద్రబాబు గారి వ్యవహారం కూడా. ఇక్కడ కామెడీ ఏంటంటే ఆ తుఫాను చెప్పకుండా వచ్చింది కాదు,తెలీకుండా వచ్చింది అంతకంటే కాదు.బాబు గారు కనుసైగల్లో వచ్చిందే.లేకుంటే బాబు గారికి తెలీకుండా రాష్ట్ర రాజధాని అమరావతికి ఆనుకుని వున్న విజయవాడలో […]

స్విస్‌ ఛాలెంజ్‌: కేంద్రానికి ఇష్టంలేదా? 

అమరావతి నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్విస్‌ ఛాలెంజ్‌కి ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారు. ఆయన మొదటి నుంచీ ఆ పద్ధతిలోనే రాజధాని నిర్మాణం జరుగుతుందని చెబుతూ వచ్చారు. దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చే సమయంలో స్విస్‌ ఛాలెంజ్‌పై వివాదాలు తెరపైకొస్తున్నాయ్‌. అది ఏమాత్రం శుభపరిణామం కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్రం కూడా దానికి సానుకూలం కాదని ప్రధాన ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చెబుతుండగా, రాజధాని నిర్మాణంలో పారదర్శకత అవసరమని విదేశీ కంపెనీలకు భూములను కట్టబెట్టడం సబబు కాదనే అభిప్రాయం […]

డబ్బులివ్వలేం రాష్ట్రానికి తేల్చి చెప్పిన కేంద్రం

రెవెన్యూ లోటును భర్తీ చేయలేమంటే కుదరదని, విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిందేనని కేంద్రానికి స్పష్టం చేసింది. ఒక్క రైతు రుణమాఫీ తప్ప ఏ ఒక్క పథకాన్ని తాము కొత్తగా తీసుకురాలేదని పేర్కొంది. రాష్ట్ర విభజన తర్వాత 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.16,078.76 కోట్ల రెవెన్యూ లోటు తలెత్తింది. కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక సాయంగా విడుదల చేసిన రూ.2,303 కోట్లను పరిగణలోకి తీసుకున్న తర్వాత 2014 జూన్ 2 నుంచి 2015 మార్చి 31 నాటికి రూ.13,775.76 […]

సీఎం ని కదిలించిన చిన్నారి.

కారుణ్య మరణం ప్రసాదించాలని కోరుతూ జ్ఞానసాయికి సంబంధించి ప్రచురితమైన మానవీయ కథనం రాష్ట్రమంతటా చర్చనీయాంశమైంది.రమణప్ప, సరస్వతి దంపతుల కుమార్తె ఎనిమిది నెలల జ్ఞానసాయికి పుట్టుకతో కాలేయ సంబంధిత వ్యాధి ఉంది. ఇప్పటికే లక్షలు ఖర్చు చేసి చికిత్స చేయించినా ఫలితం దక్కలేదు. తమ చిన్నారి కూతురు జ్ఞానసాయి కి  కారుణ్య మరణం ప్రసాదించాలని కోర్టు ని ఆశ్రయించిన తల్లి దండ్రులు గోడు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కదిలించించింది . జ్ఞానసాయి చికిత్సకు అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే […]

చంద్రబాబు చైనా రెండోస్సారి..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూన్ 26న చైనాకి బయలుదేరుతున్నారు. ఆయనతోబాటు మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, ఏడుగురు ఉన్నతాధికారులు, ఇతరులు ముగ్గురు చైనా వెళుతున్నారు. నాలుగు రోజుల పాటు సాగే వారి పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం, రాజధాని నిర్మాణం కోసం చైనా సంస్థల సహాయ సహకారాలను పొందడం ప్రధాన ఉద్దేశ్యమని ప్రభుత్వం తెలియజేసింది. అదేంటి ఇదంతా ఇంతకు ముందే విన్నట్టుందా.అయితే మీరు విన్నదీ ,వింటున్నదీ నిజమే నండీ. గత ఏడాది కూడా చంద్రబాబు నాయుడు […]

బాబు మళ్ళీ రుణమాఫీ అన్నాడోచ్..

చంద్రబాబు కి ఎన్నికల హామీలు ఇచ్చి ఇచ్చి ఎక్కడికెళ్లినా హామీలివ్వటం అలవాటుగా మారిపోయింది.ఆచరణ సంగతి దేవుడెరుగు హామీలదేముంది చెప్పటమే కదా అన్న చందాగా తయారైంది బాబు వ్యవహారం.రుణమాఫీ విషయంలో మీరెవ్వరు చిల్లి గవ్వ కూడా చెల్లించొద్దు మా ప్రభుత్వం రాగానే మీ రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తాం అన్న చంద్రబాబే ఈ రోజు నా దగ్గర డబ్బుల్లేవు,అప్పు కూడా దొరకడం లేదని బీద ఏడుపులు ఏడవడం విడ్డురంగా ఉంది.అపార రాజకీయానుభవం వున్న చంద్రబాబు కి ఇన్నాళ్ళకి తత్వం […]

ముద్రగడ దీక్ష–పోస్టుమార్టం రిపోర్ట్

కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తన దీక్షతో అనుకున్నది సాధించారు. తుని విధ్వంసం కేసులో అరెస్టైన పదమూడు మంది విడుదలయ్యేదాకా తాను దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు.వారికి బెయిల్ వచ్చి, విడుదలైన తర్వాతనే.. ఆయన బుధవారం నాడు దీక్షను విరమించారు. అనుకున్నది సాధించి, ప్రభుత్వం పైన పైచేయి సాధించినప్పటికీ… ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారనే వాదనలు వినిపిస్తున్నాయి.అరెస్టైన వారి విడుదల కోసం ముద్రగడ పదమూడు రోజుల పాటు దీక్ష చేశారు.దీనిపై […]