ఉత్తరాంధ్రపై బాబు ఫోకస్..వైసీపీ సిట్టింగులపై పట్టు.!

వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా టి‌డి‌పి అధినేత చంద్రబాబు పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఎలాగైనా గెలిచి తీరాలని చెప్పి ఎప్పుడు ప్రజల్లోనే తిరుగుతున్నారు. ఓ వైపు నారా లోకేష్ పాదయాత్రతో ప్రజల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఇటు చంద్రబాబు బాదుడేబాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పేరుతో రోడ్ షోలు, భారీ సభలతో ప్రజల్లో ఉంటున్నారు. గత నెలలో బాబు..కృష్ణా జిల్లా, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వరుసగా పర్యటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు […]

 బీజేపీకి బాబు-పవన్ ట్విస్ట్.. అప్పుడే తేలుస్తారా?

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ పొత్తు దిశగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరు రెండు సార్లు భేటీ కావడంతో పొత్తుపై క్లారిటీ వస్తుంది. అయితే ఈ ఇద్దరు నేతలు కలవడంపై వైసీపీ  విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. తోడేళ్లు గుంపు మాదిరిగా వస్తున్నారని జగన్ తో సహ వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఎవరు కలిసొచ్చిన తమ వైపే ప్రజలు ఉన్నారని వైసీపీ నేతలు అంటున్నారు. కానీ లోలోపల మాత్రం బాబు-పవన్ పొత్తు విషయంలో వైసీపీ […]

రజనీకాంత్‌పై రాజకీయం..బాబు రివర్స్..వైసీపీకి రిస్క్.!

సూపర్ స్టార్ రజనీకాంత్..దక్షిణ భారతదేశంలో ఆయన పేరు తెలియని వారు ఉండదు..కేవలం దక్షిణ భారతదేశంలోనే కాదు..ఉత్తరాన కూడా రజనీకి ఉన్న క్రేజ్ వేరు. ఇక తమిళనాడు ప్రజలైతే ఆయన్ని ఓ దైవం మాదిరిగా కొలుస్తారు. అలాంటి రజనీకాంత్ ఇప్పుడు వైసీపీ నేతల చేతుల్లో చిక్కుకున్నారు. ఇటీవల ఆయన ఎన్టీఆర్ పై ఉన్న అభిమానం, చంద్రబాబుతో ఉన్న స్నేహం కారణంతో ఏప్రిల్ 28న విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక ఆయన […]

అటు జగన్..ఇటు బాబు..ప్రజలు ఎవరి వైపు.!

అటు సి‌ఎం జగన్, ఇటు ప్రతిపక్ష నేత చంద్రబాబు..ప్రజల్లోనే ఉంటున్నారు. భారీ సభలతో జనంలోనే ఉంటున్నారు. అయితే ఇద్దరు నేతల సభలకు ప్రజలు భారీగానే వస్తున్నారు. మరి వీరిలో ఎవరికి స్వచ్ఛందంగా వస్తున్నారు..ఎవరు బలవంతంగా తరలిస్తున్నారు. అసలు ఎవరి వైపు ప్రజలు ఉన్నారంటే..చెప్పడం కష్టం గానే ఉంది. మొదట జగన్ గురించి మాట్లాడుకుంటే..ఆయన ఈ మధ్య కాలంలోనే జనంలో ఉంటున్నారు. కాకపోతే జనంలో తిరగడం లేదు. ఏదొక పథకం పేరుతో బటన్ నోక్కే కార్యక్రమం పెట్టుకుని, సభలు […]

బీజేపీతో బాబు..రాష్ట్రంలో పొత్తు ఉంటుందా?

చాలా రోజుల నుంచి ఏపీ రాజకీయాల్లో పొత్తుల గురించి పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఎవరెవరు పొత్తు పెట్టుకుంటారో క్లారిటీ లేకుండా ఉంది. కానీ టి‌డి‌పి-జనసేన-బి‌జే‌పి పొత్తు దిశగా వెళుతున్నాయనే ప్రచారం ఉంది. ఇదే సమయంలో బి‌జే‌పి ఏమో టి‌డి‌పితో పొత్తుకు సుముఖంగా లేదని అంటుంది. ఇటు టి‌డి‌పి శ్రేణులు సైతం బి‌జే‌పితో పొత్తుకు రెడీగా లేదు. అటు జనసేన ఏమో బి‌జే‌పితో పొత్తులో ఉంది. ఇక బి‌జే‌పితో కలిసి ముందుకెళితే గెలవడం కష్టం..అందుకే […]

గుంటూరులో బాబు టూర్..ఆ రెండు స్థానాల్లో పట్టు దొరుకుతుందా?

టి‌డి‌పి అధికారంలోకి వచ్చాక కొత్తగా ఏర్పడిన ఏపీకి అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇలా రాజధాని పెట్టిన సరే..ఆ ప్రాంత పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో టి‌డి‌పి గెలవలేదు. గత ఎన్నికల్లో టి‌డి‌పి దారుణంగా ఓడింది. తాడికొండ, మంగళగిరి, పెదకూరపాడు, సత్తెనపల్లి, పొన్నూరు, వేమూరు, తెనాలి, ప్రత్తిపాడు..ఇలా అమరావతికి దగ్గరగా ఉన్న స్థానాల్లో ఓడింది. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక అమరావతిని దెబ్బతీస్తూ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో వైసీపీపై […]

పశ్చిమ ప్రకాశంలో టీడీపీకి ఊపు..లీడ్ వచ్చినట్లేనా.!

తెలుగుదేశం పార్టీకి పెద్ద పట్టు లేని ప్రాంతాల్లో పశ్చిమ ప్రకాశం కూడా ఒకటి. మొదట నుంచి ఈ ప్రాంతంలో టి‌డి‌పికి పెద్ద పట్టు లేదు. ఈ ప్రాంతంలో కనిగిరి, దర్శి, గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాల్లో ఎక్కువగా ఎస్సీ, రెడ్డి సామాజికవర్గాల ప్రభావం ఉంటుంది. అందుకే మొదట నుంచి ఈ ప్రాంతంలో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ హవా నడుస్తోంది. గత ఎన్నికల్లో ఐదు స్థానాలని వైసీపీనే కైవసం చేసుకుంది. కానీ ఈ సారి […]

ఎస్సీ స్థానాల్లో టీడీపీకి ఒక్క సీటు రాదా..వైసీపీకి రివర్స్.!

యర్రగొండపాలెంలో చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్ళ దాడి జరగడం, అక్కడ మంత్రి ఆదిమూలపు సురేశ్ చొక్కా విప్పి నిరసన తెలియజేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిడే. అయితే ఎక్కడ లేని విధంగా యర్రగొండపాలెంలో సురేశ్..తన అనుచరులతో కలిపి..బాబు రోడ్ షో వద్ద నిరసన తెలియజేశారు. దళితులకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో పోలీసులు సైతం వైసీపీ శ్రేణులకు ఫుల్ సపోర్ట్ చేసి, టి‌డి‌పి శ్రేణులపై లాఠీ చార్జ్ చేశారని, ఆ పార్టీ […]

గన్నవరం టీడీపీలో ట్విస్ట్‌లు..సీటు కోసం పోటీ.!

2019 వరకు తెలుగుదేశం పార్టీ కంచుకోట..ఇప్పుడు వల్లభనేని వంశీ అడ్డాగా మారిన గన్నవరం నియోజకవర్గంలో రాజకీయం ఊహించని విధంగా మారింది. అక్కడ టి‌డి‌పిలో గెలిచి వైసీపీలోకి వెళ్ళిన వంశీకి చెక్ పెట్టాలని టి‌డి‌పి శ్రేణులు కసి మీద ఉన్నాయి. గత  ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి గెలిచి వంశీ వైసీపీలోకి వెళ్ళిన విషయం తెలిసిందే. వైసీపీలోకి వెళ్ళి బాబుపై ఎలాంటి విమర్శలు చేస్తున్నారో చెప్పాల్సిన పని లేదు. అలాగే వంశీ వైసీపీలోకి వెళ్ళడంతో టి‌డి‌పికి సరైన నాయకుడు లేకుండా […]