టీడీపీలో రాయపాటి ఇష్యూ..వారసుడు టికెట్‌ కోసం.!

తెలుగుదేశం పార్టీలో సీట్ల కోసం పోటీ పెరిగింది. రాష్ట్రంలో పార్టీ బలపడుతూ ఉండటం…వైసీపీకి ధీటుగా పార్టీ ఉండటంతో టి‌డి‌పిలో సీట్ల కోసం పోటీ నెలకొంది. ఇప్పటికే చాలా సీట్లలో ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే నెక్స్ట్ ఎన్నికల్లో సీటు కోసం మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు గట్టిగానే కష్టపడుతున్నారు. తనతో పాటు తన తనయుడుకు సీటు ఇప్పించుకోవాలని చూస్తున్నారు. వాస్తవానికి నరసారావుపేట ఎంపీ సీటు రాయపాటి ఫ్యామిలీదే.. కానీ ఇటీవల కాలంలో అక్కడ యాక్టివ్ గా లేదు.

ఓ వైపు రాయపాటికి వయసు మీద పడిన విషయం తెలిసిందే. గతంలో పలుమార్లు గుంటూరు నుంచి కాంగ్రెస్ లో ఎంపీగా గెలిచిన రాయపాటి..2014లో టి‌డి‌పి నుంచి నరసారావుపేట ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అని ఆలోచించి చివరికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత నుంచి రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్ గా లేరు. కానీ ఇటీవల టి‌డి‌పిలోకి కన్నా లక్ష్మీనారాయణ వచ్చిన నేపథ్యంలో..ఆయన్ని టి‌డి‌పిలోకి రాకుండా అడ్డుకోవాలని చూశారు. ఎందుకంటే గతంలో కన్నా, రాయపాటిల మధ్య రాజకీయ వైరం ఉంది. ఆ వైరం ఇప్పటికీ కొనసాగుతుంది.

అయితే కన్నా టి‌డి‌పిలోకి వచ్చారు..దీంతో రాయపాటి కూడా సైలెంట్ అయ్యారు..తాను చంద్రబాబు కోసం పనిచేస్తానని చెప్పుకొచ్చారు. అదే సమయంలో తనకు నరసారావుపేట ఎంపీ సీటు ఇస్తే మళ్ళీ పోటీ చేస్తానని అన్నారు..గత ఎన్నికల్లో అంటే డబ్బులు లేవని, ఇపుడు ఉన్నాయని చెబుతున్నారు. అలాగే తన తనయుడు రంగబాబుకు సత్తెనపల్లి గాని పెదకూరపాడు సీటు గాని ఇవ్వాలని కోరుతున్నారు.

కాకపోతే రాయపాటికి సీటు దక్కేలా లేదు..నరసారావుపేట ఎంపీ సీటు పుట్టా మహేష్‌కు ఇస్తారని తెలుస్తోంది..ఇటు రాయపాటి వారసుడుకు సీటు విషయంలో క్లారిటీ లేదు.