సమంత వదులుకున్న 5 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఇవే..!

ఏమాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ స‌మంత‌. మొద‌టి సినిమాతోనే సామ్ ప్రేక్ష‌కుల‌ను త‌న మాయలో ప‌డేసుకుంది. ఆ త‌ర‌వాత చాలా సినిమాల‌లో న‌టించింది. రామ్ చ‌ర‌ణ్‌, మ‌హేశ్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప‌వ‌న్ ఇలా స్టార్ హీరోలు అంద‌రితోనూ స‌మంత సినిమాలు చేసింది. ఇక స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన స‌మంత కెరీర్ ప‌రంగా వార్త‌ల్లో హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల‌లో న‌టించిన‌ప్ప‌టికీ కొన్ని మంచి సినిమాల‌ను కూడా చేతులారా మిస్ చేసుకుంది. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

పుష్ప :
అల్లు అర్జున్ హీరోగా న‌టించిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ సినిమాలో స‌మంత ఐట‌మ్ సాంగ్ హైలెట్ … .అయితే నిజానికి ఈ సినిమాలో మొద‌ట హీరోయిన్ గా స‌మంత‌ను అనుకున్నారు. కానీ స‌మంత విడాకుల ఇష్యూ వ‌ల్ల ఈ సినిమాను చేతులారా మిస్ చేసుకుంది. అయితే చివ‌ర‌కు ఆమె చేసిన ఊ అంటావా మావా ఐటెం సాంగ్ బాగా పేలింది.

Chiyaan Vikram And Amy Jackson Full Movie Hd | Telugu Hungama - YouTube

ఐ :
త‌మిళ ద‌ర్శ‌కుడు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన భారీ బ‌డ్జెట్ చిత్రం ఐ.. ఈ సినిమాలో విక్ర‌మ్ హీరోగా న‌టించగా యామి జాక్స‌న్ హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమాకు కూడా మొద‌ట హీరోయిన్ గా స‌మంత‌ను అనుకున్నారు. కానీ డేట్స్ స‌ర్దుబాటు కాక‌పోవ‌డంతో స‌మంత ఈ సినిమాను కూడా చేతులారా మిస్ చేసుకుంది.

Watch Ninnu Kori Full Movie Online in HD Quality | Download Now

నిన్ను కోరి :
నాని కెరీర్‌లో సూప‌ర్ హిట్ సినిమాల‌లో నిన్ను కోరి కూడా ఒక‌టి. ఈ సినిమా ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కి ప్రేక్ష‌కుల మ‌నసు దోచుకుంది. ఈ సినిమాలో నివేదా థామ‌స్ హీరోయిన్ గా న‌టించింది. అయితే ఈ సినిమాలో కూడా ముందుగా స‌మంత‌ను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ స‌మంత డేట్స్ స‌ర్దుబాటు కాక‌పోవ‌డంతో ఈ సినిమాను కూడా మిస్ చేసుకుంది. ఇది చాలా ఫీల్‌గుడ్ మూవీ. స‌మంత ఈ పాత్ర చేసి ఉంటే ఖ‌చ్చితంగా ఆమెకు మంచి పేరు వ‌చ్చి ఉండేది.

Watch Yevadu - Disney+ Hotstar

ఎవ‌డు :
ఇదిలా ఉండ‌గా రామ్ చ‌ర‌ణ్ – అల్లు అర్జున్ హీరోలుగా న‌టించిన ఎవ‌డు సినిమా మంచి విజ‌యం సాధించింది. అయితే ఈ సినిమా ఆఫ‌ర్ మొద‌ట స‌మంత‌కు రాగా క‌థ నచ్చ‌క‌పోవ‌డంతో సున్నితంగా రిజెక్ట్ చేసింది. ఆ త‌ర్వాత ఈ ప్లేసులోకి శృతీహాస‌న్ వ‌చ్చి చేరింది.

Student Of The Year - Official Trailer - Sidharth Malhotra, Alia Bhatt &  Varun Dhawan - YouTube

స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ :
ఈ సినిమాలు మాత్ర‌మే కాకుండా బాలీవుడ్ లో సూప‌ర్ హిట్ గా నిలిచిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ సినిమాను కూడా స‌మంత రిజెక్ట్ చేసి బాలీవుడ్ లో స‌త్తాచాటే ఛాన్స్ ను మిస్ చేసుకుంది.