బాబు దూకుడు..వైసీపీ స్కెచ్..మంత్రికి నో యూజ్.!

రాష్ట్రంలో ఇటు చంద్రబాబు పర్యటనలకు గాని, అటు లోకేష్ పాదయాత్రకు గాని ప్రజా స్పందన పెద్ద ఎత్తున వస్తున్న విషయం తెలిసిందే. అధికార వైసీపీకి చెక్ పెట్టే విధంగా బాబు, లోకేష్ ముందుకెళుతున్నారు. ఇక వీరికి వస్తున్న ప్రజా మద్ధతు నేపథ్యంలో వైసీపీ ఊహించని స్కెచ్‌లు వేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన ఊపులో టి‌డి‌పి ఊపు ఉంది. ఇంకా బాబు, లోకేష్ రాష్ట్రం మొత్తం రౌండప్ చేసేస్తున్నారు. దీంతో టి‌డి‌పికి సరికొత్త జోష్ వస్తుంది.

మరి టి‌డి‌పికి మద్ధతు పెరుగుతుందని ప్లాన్ చేశారో..లేక వారికి బ్రేకులు వేయాలని అనుకున్నారో తెలియదు గాని..ఊహించని విధంగా ఒకేరోజు..అటు లోకేష్, ఇటు బాబు పర్యటనలకు వ్యతిరేకంగా వైసీపీ నిరసనలు తెలియజేసింది. ఆదోనిలో లోకేష్ పాదయాత్రకు పోటీగా వైసీపీ శ్రేణులు వచ్చాయి. కానీ వారికి ధీటుగా టి‌డి‌పి శ్రేణులు నిలబడ్డాయి. అక్కడ వైసీపీ సక్సెస్ కాలేదు. ఇక యర్రగొండపాలెంలో బాబు రోడ్ షో జరిగింది. అక్కడ పోటీగా మంత్రి ఆదిమూలపు సురేష్..చొక్కా విప్పి మరీ తమ పార్టీ శ్రేణులతో నిరసన తెలియజేశారు.

అయితే జగన్ పర్యటనకు వస్తుంటే…రోడ్డు మీద ఒక్క షాపు కూడా లేకుండా చేస్తున్న పోలీసులు…బాబు పర్యటనకు వస్తుంటే..రోడ్డు పక్కనే వైసీపీ శ్రేణులు నిరసన తెలియజేసే వరకు తెచ్చారు. ఇక వైసీపీ శ్రేణులని కాకుండా పోలీసులు టి‌డి‌పి శ్రేణులపై ఆంక్షలు పెట్టారు. ఇదే క్రమంలో బాబు కాన్వాయ్ పై వైసీపీ శ్రేణులు రాళ్ళ దాడి చేశాయి. ఈ క్రమంలో బాబుని ఎన్‌ఎస్‌జి కమాండ్స్ రక్షణగా నిలిచారు. దీంతో అందులో ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్‌కు గాయమైంది.

ఇంతవరకు వచ్చేలా వైసీపీ శ్రేణులే చేశాయని టి‌డి‌పి శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. ఇక అలా చేయడం వల్ల మంత్రి సురేష్‌కు వచ్చిన ప్రయోజనం ఏమి లేదు గాని…అనవసరంగా ఆయనకే మైనస్ అయింది. మంచి ఎడ్యుకేటెడ్ మంత్రి ఇలా చేయడం ఏంటని ప్రశ్నలు వస్తున్నాయి.