సినీ ఇండస్ట్రీ సోగ్గాడు ఎవరంటే ఇప్పటికీ చెబుతారు శోభన్ బాబు అని. ఆయన మన మధ్య లేకున్నా జ్ఞాపకాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. తాను ఎక్కడ మొదలు పెట్టానో.. అక్కడే పూర్తిచేస్తానని అనుకున్న శోభన్ బాబు సినిమాల్లో హీరోగా కెరీర్ ప్రారంభించి చివరి వరకు హీరోగానే చేసి ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నారు. చిత్ర పరిశ్రమలోకి ఎందరో హీరోలు, టెక్నీషియన్లు తమ వారసులను తీసుకొచ్చారు. కానీ శోభన్ బాబు మాత్రం తన వారసులను పరిచయం లేదు. కనీసం తన ఫ్యామిలీ గురించి ఎటువంటి విషయాలను ఇతరులతో పంచుకోలేదు.
ఆ తర్వాత కూడా కొందరు ఆయనతో సినిమాలు చేయాలని పట్టుబట్టారు. అయితే ఆయన కావాలనే రెమ్యునరేషన్ ఎక్కువ చెప్పి ఆ సినిమాల నుంచి తప్పుకున్నారు. కానీ, వ్యక్తిగతంగా మాత్రం ఆయన క్రమశిక్షణకే ప్రాధాన్యం ఇచ్చారు. మనం ఒక్కళ్లమే కాదు.. మన తర్వాత తరం కూడా బాగుపడాలి! అనేది సోగ్గాడి మాట. దీనినే ఆయన పాటించారు. ఇక, ఆయన వారసులు గా ఎవరూ కూడా తెరమీదకు రాలేదు.
నిజానికి ఆయనకు వారసులు లేరా.. అంటే.. ఉన్నారు ఆయన కుమారుడు కరుణ.. అచ్చం శోభన్‌బాబు లాగా ఎంతో అందగాడు. చిన్నారి పాపలు సినిమా (సావిత్రి తీసిన సినిమా)లో చిన్నారి వేషంలో తప్ప తర్వాత.. ఎక్కడా కనిపించలేదు. అయితే.. ఎందుకు శోభన్‌బాబు ఇలా చేశారు.? అనేది ప్రశ్న. తన సహ నటుడు.. కృష్ణ కుమారులు ఇద్దరినీ తీసుకువచ్చారు.
కానీ, సోగ్గాడు మాత్రం తన సంతానాన్ని తెరమీదకు తీసుకురాలేదు. దీనికి కారణం.. వారి చదువులు భగ్నం అవడమేనని చెప్పేవారు. అంతేకాదు.. తాను సంపాయించుకున్న ఆస్తులను వారు పెంచుకుంటే చాలనేది సోగ్గాడి ఆలోచన. అందుకే వారసులను తీసుకురాని నాటి తరం అతి కొద్దిమదంది హీరోల జాబితాలో సోగ్గాడు ముందున్నారు.