స్టార్ హీరోల హిట్‌ సినిమాలు=పవర్ స్టార్ ప్లాప్ సినిమాలు..!

టాలీవుడ్ స్టార్ హీరోలు భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తూ.. భారీ స్థాయిలో రెమ్యూనరేషన్లు అందుకుంటున్నారు. ఇక ఈ క్రమంలోనే అగ్ర హీరోలతో సినిమాలు చేస్తే లాభాలు వస్తాయని నిర్మాతలు భావిస్తుంటారు. అదే సమయంలో ఆ సినిమాల బడ్జెట్ కూడా విపరీతంగా పెరిగిపోవడంతో కొన్ని సినిమాలు భారీ అంచనాలతో వచ్చి ఎవరు ఊహించని విధంగా డిజాస్టర్ సినిమాలు గా మిగిలిపోతున్నాయి. సినిమాల‌ బడ్జెట్ పెరిగిపోవడం.. ఆ సినిమాలను ఎక్కువ రేటుకు అమ్మటం.. ఆ స్థాయిలో కలెక్షన్లు రాకపోవడంతో పెద్ద హీరోల సినిమాలకు కూడా నష్టాలు తప్పడం లేదు.

అయితే అంతటి భారీ డిజాస్టర్ టాక్ తో కూడా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టిన ఘనత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మాత్రమే దక్కుతుంది. టాలీవుడ్ లో ఏ హీరోకి లేని భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నాడు. ఆయన సినిమాలకు జయ అపజయాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. పవర్ స్టార్ తన ప్లాప్ సినిమాలతో కూడా టాలీవుడ్ లో తిరుగులేని రికార్డులు సృష్టించారు. పవన్- వెంకటేష్ కాంబోలో వ‌చ్చిన‌ గోపాల గోపాల సినిమా ప్లాప్‌ టాక్ తో కూడా రూ.90 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

Power Star Pawan Kalyan's Movies Hits and Flops List | 25CineFrames

కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ వీరంకు రీమేక్‌గా వచ్చిన కాటమరాయుడు కూడా బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌ సినిమాగా మిగిలింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.90 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా తొలిరోజే ఏకంగా రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రావడం విశేషం.
పవన్ కళ్యాణ్ కెరీర్ ని టర్న్ చేసిన సినిమాలలో గబ్బర్ సింగ్ కూడా ఒకటి.. బాలీవుడ్లో సల్మాన్ హీరోగా వచ్చిన దబాంగ్ సినిమాకు రీమేక్ గా గబ్బర్ సింగ్ వచ్చింది.

Pawan's Real Stamina Known with Flops | cinejosh.com

ఈ సినిమా అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. ఈ సినిమాకు సీక్వల్ గా వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది. అయినా కూడా సర్దార్ గబ్బర్ సింగ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రూ.92 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ప‌వ‌న్‌-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. వాటిలో రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాయి. అయితే వీరి కాంబోలో మూడో సినిమాగా వచ్చిన అజ్ఞాతవాసి మాత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుని భారీ ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది.

Pawan Kalyan's Agnyaathavaasi in copyright row | Entertainment News,The  Indian Express

ఈ సినిమా కూడా తన కలెక్షన్‌ల‌తో భారీ రికార్డులను తిరగరాసింది. ఈ సినిమాకు ఏకంగా 95 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. విచిత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ డిజాస్టర్ సినిమాలకు దాదాపుగా రు. 100 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు వస్తున్నాయి. అదే తెలుగులో చాలామంది స్టార్ హీరోల సినిమాలు సూపర్ హిట్ అయినా కూడా ఈ స్థాయి వసూళ్లు రావటం లేదు. ఆ క్రేజ్ పవన్ కళ్యాణ్ కు మాత్రమే సొంతం అని చెప్పాలి.