ఆన్ లైన్ పైనే మోజు అందని ఫించన్లు

ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద జిల్లా వ్యాప్తంగా 3,86,826 మంది పింఛన్‌దారులు ఉన్నారు. ఆన్ లైన్ మోజులో ఆఫ్ లైన్ పై అధికారులు దృష్టి పెట్టడం లేదని విమర్శలు మాత్రం వినిపిస్తున్నాయి. పింఛన్ల పంపిణీలో పారదర్శకత కోసం ప్రభుత్వం ట్యాబ్‌లు పంపిణీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో సంకేతాలు (సిగ్నల్స్‌) అందకపోవడంతో పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సంకేతాలందే ప్రాంతాల్లో కార్యదర్శులు, సీసీలు కూర్చుని పింఛన్లు పంపిణీ చేయాల్సి వస్తోంది. సంకేతాలు సక్రమంగా అందకపోవడం, వేలిముద్రల సమస్యలతో ఒక్కో […]

మాగంటి గారి గెడ్డం నిర‌స‌న‌

స్వతంత్ర దేశంలో అహింసాయుత నిర‌స‌న‌ల్లో ఇదో ట్రెండ్… మాగంటి గారి గెడ్డం నిర‌స‌న‌. ..ఏపీకి ప్రత్యేక హోదా విషయం రాష్ట్ర ఎంపీల‌ను ఎంత‌గా ఉక్కిరిబిక్కిరి చేసేస్తోందో చెప్పడానికి ఇదో ఎగ్జాంపుల్… హోదాపై ఇప్పటి వ‌ర‌కు అనేక రూపాల్లో అధికార ప‌క్ష ఎంపీలు, విప‌క్ష వైకాపా ఎంపీలు త‌మ నిర‌స‌న‌ను వ్య‌క్తం చేశారు. అయితే, ఇప్పుడు ఇక‌, వ్య‌క్తిగ‌తంగా కూడా కేంద్రంపై నిర‌స‌న తెలిపేందుకు సిద్ధ‌మైపోయారు అధికార ప‌క్ష ఎంపీలు. ఇప్ప‌టికే చిత్తూరు ఎంపీ, సినీ న‌టుడు శివ‌ప్రసాద్‌.. […]

జగన్‌ కొత్త గెటప్‌ వెనుక రాజకీయ కోణం

అధికారంలో ఉన్నవారెవరైనాసరే కులమతాలకతీతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అన్ని మతాల పండుగల్లోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు. ఆయా మతాచారాల ప్రకారం వ్యవహరిస్తారు. అయితే ప్రతిపక్షంలో ఉన్నవారికి అవన్నీ చేయాలని రూలు ఏమీ లేదు. ఆయా మతాల పండుగల్లో పాల్గొనడం వేరు, ఆ మతాచారాల్ని పాటించడం వేరు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌, క్రిస్టియానిటీని విశ్వసిస్తారు. అలాగని ఆయన ఇతరమతాలకి వ్యతిరేకి కాదు. కానీ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడి దర్శనం కోసం వెళ్లి, ‘విశ్వాసం’ తెలపలేదనే […]

పుష్కరం ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకం

పన్నెండేళ్ళకు వచ్చే పుష్కరాలు ఎంతో ప్రత్యేకమైనవి. అలా ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల గోదావరి పుష్కరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలోనూ తొలి పుష్కరాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఏడాది తిరిగింది, ఈసారి కృష్ణా పుష్కరాలొచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చేశాయి. ఈ నెల 12వ తేదీ నుంచి పుష్కరాలు జరగనుండగా, ముందే పుష్కర వైభవం తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా ప్రత్యేకం ఈ కృష్ణా పుష్కరాలు. ఎందుకంటే, పుష్కరాలు జరిగే ప్రధానమైన రెండు జిల్లాల […]

విశాఖకు దూరమవుతున్న విద్యాసంస్థలు

ప్రతిష్ఠాత్మకమైన వివిధ విద్యా సంస్థలను విశాఖలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినప్పటికీ అవి ఇతర జిల్లాలకు తరలిపోతున్నాయి. తాజాగా విశాఖలో ఏర్పాటు చేయాలనుకున్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్‌మెంట్ (ఐఐపిఎం) కృష్ణాజిల్లా కొండపల్లికి తరలించాలని నిర్ణయించారు. విభజన నేపథ్యంలో పలు విద్యా సంస్థలను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందు కు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చిన విషయం తెలిసిందే. వాటిలో కొన్ని విశాఖలో ఏర్పాటు చేయాలనీ నిర్ణయించారు. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని పరిశ్రమలు ఏర్పడిన విషయం తెలిసిందే. అందులో కొన్ని […]

ఈ సారైనా స్మార్ట్ సిటీ దక్కేనా…

రెండో దఫా స్మార్ట్‌ సిటీలో తిరుపతికి చోటుదక్కుతుందోలేదోనన్న ఎదురుచూపులు ఎక్కువవుతున్నాయి. కేంద్రమంత్రి పదవిలో కొలువుదీరిన వెంకయ్యనాయుడు ఈ సారైనా కరుణిస్తారోలేదోనని నగరవాసులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.వంద నగరాల్లో మొదటి దఫా 20 నగరాలను ఎంపికచేసినా.. అందులో తిరుపతికి చోటుదక్కని సంగతి తెలిసిందే. 40 నగరాలతో రెండో జాబితాను ప్రకటించాల్సి ఉండగా కొన్ని కారణాలచేత 13 నగరాలను ఎలాంటి ఎంపిక ప్రతిపాదనలు లేకుండానే ఈ ఏడాది మేలో ప్రకటించారు. మిగిలిన 27 నగరాలను ఆగస్టు 15లోపు ప్రకటించాల్సి ఉంది. […]

ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లెక్కలు తేలాయి….

విభజన జరిగిన రెండేళ్ల తర్వాత… రెండు రాష్ట్రాల పంచుకోవలసిన ఆస్తుల లెక్కలు తేలుతున్నాయి. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పదో షెడ్యూలులో పేర్కొన్న సంస్థల ఆస్తులపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. మొత్తం 142 సంస్థల్లో 132 సంస్థల వివరాలను అధికారులు ఇప్పటికే సేకరించారు. మరో 10 సంస్థల నుంచి వివరాలు అందలేదు. భూములు, భవనాలతో కూడిన భూములు, కార్యాలయాల సామగ్రి, వివిధ సంస్థల మెషినరీ సంబంధిత సామగ్రి, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బ్యాంకు అకౌంట్లు… […]

చంద్రబాబు పై అసంతృప్తితో పయ్యావుల

టీడీపీ సీనియ‌ర్ నేత ఎమ్మెల్సీ ప‌య్యావుల కేశవ్‌.. పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుపై ప‌రోక్షంగా ఫైర‌య్యారా? చ‌ంద్రబాబుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ద‌శాబ్దాలుగా టీడీపీకి సేవ చేస్తున్నా, ప‌దేళ్లపాటు ప్రతిప‌క్షంలో ఉన్నప్పుడు నానా తిప్పలు ప‌డి అధికారంలోకి తీసుకువ‌చ్చినా త‌మ‌కు ఎలాంటి గుర్తింపూ లేద‌ని ఆయ‌న వాపోతున్నట్టు తెలిసింది. అంతేకాదు, ముందొచ్చిన చెవుల క‌న్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా పార్టీ అధినేత త‌మ‌ను కాద‌ని, ఇప్పుడిప్పుడే సైకిలెక్కుతున్న వారిని […]

‘త్వరలో’ అంటే పదేళ్ళు సరిపోద్దా!

త్వరలో ప్రత్యేక హోదాపై స్పష్టత రావచ్చునని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి. ఈలోగా తొందరపాటు నిర్ణయాలు తగవనీ, ఆందోళనల వల్ల ఉపయోగం లేదని, నరేంద్రమోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ని ప్రత్యేకంగా చూస్తోందని ఈ కేంద్ర మంత్రులు చెబుతున్నారు. కానీ ప్రత్యేక హోదా వస్తుందని నమ్మి భారతీయ జనతా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టబెట్టిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు తమకు హోదా రాక తీవ్ర నిరాశ చెందుతున్నమాట వాస్తవం. ఇప్పటికి కూడా ప్రత్యేక హోదా […]