ప్రత్యేక హోదా కథ ముగిసినట్టే నా?

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కథ ముగిసినట్లే భావించాలి. ద్రవ్యబిల్లు అనే సాకుతో రాజ్యసభలో ఈ బిల్లుపై ఓటింగ్‌ జరగకుండా చేయడంలో భారతీయ జనతా పార్టీ సఫలమయ్యాక, కాంగ్రెసు పార్టీ అయినా ఇంకొక పార్టీ అయినాసరే ఏ మార్గంలోనూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చే అవకాశం లేకుండాపోయింది. మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ నుంచి ఈ విషయంలో భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతు లభిస్తోంది. ‘అంతకు మించి’ అంటూ అసలుదానికి పాతరేయడం ద్వారా టిడిపి, బిజెపి ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం చేస్తున్నాయనే […]

ఇంకా ఆశల పల్లకిలోనే ప్రత్యేక హోదా

ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చే విషయమై కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీ వైఖరి తేలిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు, టిడిపి ఎంపిల సమావేశంలో కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడి ఎటువంటి హామీని ఇవ్వలేదని సమాచారం. దాంతో ఏపికి ప్రత్యేకహోదా రాదన్న విషయం మరోసారి స్పష్టమైపోయింది. జాతీయ పార్టీలన్నీ రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇచ్చి తీరాల్సిందేనంటూ స్పష్టంగా చెప్పినా భాజపా పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు, టిడిపి ఎంపిలు విడివిడిగా ప్రధానమంత్రిని కలిసి మాట్లాడిన తర్వాత కూడా హోదాకు కమలనాధులు సానుకూలంగా స్పందిచాలని […]

సోలో క్రెడిట్‌ వైఎస్‌ జగన్‌దే

ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా బంద్‌ విజయవంతమైంది. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనడంతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ ఇంకా ఉత్సాహంగా బంద్‌ని విజయవంతం చేసింది. ముందస్తుగా పార్టీ నాయకుల్ని సమాయత్తం చేసిన వైఎస్‌ జగన్‌, ఈ బంద్‌ని సంపూర్ణంగా విజయవంతం చేసి కేంద్రానికి, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ప్రత్యేక హోదా కోసం ఉంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారో తెలియజేశారు. తద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆవేదన కేంద్రానికి అర్థమయ్యేలా చేయడంలో వైఎస్‌ జగన్‌ విజయం సాధించగలిగారని చెప్పడం నిస్సందేహం. […]

ఈ సారి 1st తెలంగాణ నెక్స్ట్ ఏపీ

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్  ర్యాంకులలో తెలంగాణ ప్రథమస్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ రెండోస్థానంలో ఉంది. ఈఓడీబీ ప్రాథమిక ర్యాంకులను కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖకు చెందిన వాణిజ్య విధాన విభాగం ప్రకటించింది. 60.24 శాతం స్కోరుతో తెలంగాణ మొదటి స్థానంలో నిలవగా, 55.75 శాతం స్కోరుతో ఏపీ రెండో స్థానానికి పరిమితమైంది. గత ఏడాది ఏపీ రెండోస్థానంలో ఉండగా తెలంగాణకు 13వ స్థానం వచ్చింది. అయితే 2016 జూన్ లో వెలువడిన ప్రాథమిక ఫలితాలలో తెలంగాణ రెండో స్థానంలో […]