సుజ‌నా కేంద్ర‌మంత్రి ప‌ద‌వికి గండం

ఎన్నో కీల‌క నిర్ణ‌యాల‌తో, ప‌థ‌కాల‌తో, వరుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న ప్ర‌ధాని మోదీ.. మ‌రో కీల‌క నిర్ణ‌యానికి జూలైలో శ్రీ‌కారం చుట్ట‌బోతున్నారు. అధికారంలోకి వ‌చ్చి మూడేళ్ల‌యినా ఇప్ప‌టి వ‌ర‌కూ ఒకే ఒక్క‌సారి మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ చేసిన ఆయ‌న‌.. ఇప్పుడు మ‌రోసారి కేబినెట్ విస్త‌ర‌ణ చేప‌ట్టబోతున్నారు. దీంతో కొంత‌మంది కేంద్ర మంత్రుల్లో ఇప్ప‌టికే గుబులు మొద‌లైంది. ముఖ్యంగా టీడీపీ ఎంపీ, ప్ర‌స్తుతం కేంద్ర‌మంత్రి సుజ‌నా చౌద‌రి ఈ విష‌యంలో మ‌రింత కంగారు ప‌డుతున్నార‌ట‌. గ‌తంలో ఒకసారి విస్త‌ర‌ణ జ‌రిగినా.. […]

ఆ రెడ్డి నాయ‌కుడే టి కాంగ్రెస్ సీఎం?!

ఆలూ లేదు సూలూ లేదు కొడుకు పేరు సోమ‌లింగం.. అన్న‌ట్లు ఉంది టికాంగ్రెస్ ప‌రిస్థితి. ఇంకా ఎన్నిక‌ల‌కు రెండేళ్లు స‌మయం ఉండ‌గానే.. సీఎం అభ్య‌ర్థి ఎవ‌రనే చ‌ర్చ మొద‌లైపోయింది. సీఎం అభ్య‌ర్థిగా ఎవ‌రైతే బాగుంటుందో ఇప్పటి నుంచే.. అధిష్టానానికి విన్న‌పాలు కూడా వెళుతున్నాయ‌ట‌. అంతేగాక సీఎం అభ్య‌ర్థి ఎవ‌రో తేలితేగాని ఒప్పుకోమని కార్య‌కర్త‌లు కూడా ప‌ట్టుద‌ల‌తో ఉన్నార‌ట‌. మ‌రి నాయ‌కులే తొంద‌ర‌ప‌డుతున్నారో.. లేక కార్య‌క‌ర్త‌లే తొంద‌ర ప‌డుతు న్నారో తెలియ‌దు గానీ.. అధిష్టానానికి ముందుగా పీసీసీ చీఫ్ […]

ఆ న‌లుగురు టీడీపీ ఎంపీల‌కు ప్ర‌జాసేవ నై…వ్యాపారాలే జై 

టికెట్ ఇచ్చిన పార్టీకి, ఓట్లేసిన ప్ర‌జ‌ల‌కు కొంత‌మంది తెలుగుదేశం ఎంపీలు శ‌ఠ‌గోపం పెడుతున్నారు. పార్టీని, ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోకుండా కేవ‌లం వ్య‌క్తిగ‌త అజెండాతో వ్య‌వ‌హ‌రిస్తున్నారు. స్వ‌త‌హాగా పారిశ్రామిక వేత్త‌ల‌యిన వీరు.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా కేవ‌లం త‌మ పరిశ్ర‌మ‌ల అభివృద్ధికే ప్రాధాన్యం ఇస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. త‌మ వ్యాపారాలు, వ్య‌క్తిగ‌త స‌మస్య‌ల‌ను ప‌ట్టించుకుని.. ప్ర‌జ‌లను, పార్టీని పూర్తిగా విస్మ‌రించార‌ని అంత‌ర్గ‌తంగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌జ‌ల‌కు చేరువ‌కాక‌పోవ‌డంతో పాటు సొంత వ్యాపారాలు, సొంత ఎజెండాతో ముందుకు వెళుతుండ టంతో […]

బాహుబ‌లిపై కేసీఆర్ క‌క్ష తీర్చుకున్నాడా..!

ప్ర‌పంచవ్యాప్తంగా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూసిన సినిమాపై తెలంగాణ ప్ర‌భుత్వం ఎందుకు ఇలా ప్ర‌వర్తిస్తోంది? తెలుగు సినిమా గురించి దేశంలోని అన్ని ప్రాంతాల ప్ర‌జ‌లు వేనోళ్ల పొగుడుతున్న వేళ‌.. టీఆర్ఎస్ నాయ‌కులు ముఖ్యంగా సీఎం కేసీఆర్ ఈ సినిమా విష‌యంలో కాస్త డిఫ‌రెంట్‌గా ప్ర‌వ‌రిస్తున్నారా ? అన్న సందేహాలు అంద‌రి మ‌దిలోను క‌లుగుతున్నాయి. మొన్న‌టికి మొన్న `గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి` సినిమాకు, అంత‌కుముందు రుద్ర‌మ‌దేవి సినిమాకు ప‌న్ను మిన‌హాయింపు ఇచ్చిన టీఆర్ఎస్‌ ప్ర‌భుత్వం.. ఇప్పుడు `బాహుబ‌లి-2` సినిమాకు రాయితీలు ఇవ్వ‌క‌పోవ‌డంతో […]

సైకిల్ గుర్తు వ‌ద్దు.. క‌మ‌లంపై పోటీ చేస్తాం

బీజేపీ-టీడీపీ పొత్తు రెండు రాష్ట్రాల్లో వింత‌గా ఉంది. ఒక‌చోట టీడీపీ బ‌లంగా ఉంటే.. మ‌రోచోట బీజేపీ బ‌లాన్ని పుంజుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఒకచోట సొంతంగా ఎదిగేందుకు బీజేపీ ఆరాట‌ప‌డుతుంటే.. మరోచోట అస్థిత్వం కోసం టీడీపీ పోరాడుతోంది. క‌ల‌హాలు ఉన్నా ఏదోలా ఇన్నాళ్లూ జోడీ బండిని లాక్కుంటూ వస్తున్నారు. ఏపీలో ప‌రిస్థితి ఎలా ఉన్నా.. తెలంగాణ‌లో మాత్రం వింతైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే టీటీడీపీ నాయ‌కులు స‌రికొత్త ప్ర‌తిపాద‌న‌ను తెర‌పైకి తీసుకొచ్చార‌ట‌. పార్టీని విలీనం చేయ‌కుండానే.. బీజేపీ జెండాతో […]

ఆ జిల్లాలో మంత్రుల మ‌ధ్య ఆధిపత్య‌పోరు

వర్గపోరుకీ, రాజకీయ యుద్ధాలకీ పెట్టింది పేరైన నెల్లూరులో ఇద్దరు మంత్రుల మ‌ధ్య పొర‌ప‌చ్చాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ మంత్రి నారాయ‌ణ ఆడింది ఆట పాడింది పాట‌గా ఉన్న ఈ జిల్లాలో.. ఆయ‌న‌కు పోటీగా సోమిరెడ్డి వ‌చ్చారు. క్యాబినెట్ లో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి మంత్రి పదవి ద‌క్క‌డంతో ఒక్కసారిగా నెల్లూరు జిల్లాలో పాలిటిక్స్ హీటెక్కాయి. దీంతో క్యాడ‌ర్‌లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒక‌పక్క సోమిరెడ్డి దూసుకుపోతుం డ‌టంతో.. నారాయ‌ణ కూడా ఆయ‌న్ను అందుకునేందుకు తెగ ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌. మంత్రివర్గ విస్తరణకి ముందు […]

వ్యూహ‌క‌ర్త‌కు పొగ‌పెడుతూ వ్యూహాలు

పార్టీలో ముందు నుంచీ ఉంచి ఉన్న త‌మ‌ను.. ప‌క్క‌న పెడ‌తామంటే సీనియర్లు ఊరుకుంటారా?! పార్టీ నిర్మాణానికి కృషి చేసిన త‌మను.. క‌రివేపాకులా తీసి పారేస్తుంటే స‌హించ‌గ‌ల‌రా? అధినేత‌కు క‌ష్ట‌కాలంలో చేదోడు వాడుగా ఉన్న త‌మ‌ను..ఎవరి అదుపాజ్ఞ‌ల్లోనో న‌డ‌వ‌మంటే న‌డ‌వ‌గ‌ల‌రా? అసాధ్య‌మే క‌దా! ఇప్పుడు ఇదే ప‌రిస్థితి వైసీపీలోని కొంద‌రు సీనియ‌ర్ నాయ‌కుల్లో క‌నిపిస్తోంది. ఇటీవ‌ల 2019 ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా ప్ర‌శాంత్ కిషోర్‌ను అధినేత జ‌గ‌న్‌ తీసుకురావ‌డం.. వైసీపీలో ముస‌లం రేపింది. అందుకే ఆయ‌న‌కు పొగ‌ప‌ట్టేందుకు ఇప్ప‌టినుంచే సీనియ‌ర్ […]

మోదీ నిర్ణ‌యానికి చంద్ర‌బాబు సై.. లోకేష్‌ నై

ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు, పంచాయ‌తీ,ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌.. రోజుకో సంచ‌ల‌న వ్యాఖ్య‌తో వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లు స‌మావేశాల్లో త‌డ‌బ‌డుతూ వ్యాఖ్య‌లు చేసి తండ్రికి త‌ల‌నొప్పులు తీసుకొచ్చిన ఆయ‌న‌.. మ‌రోసారి చంద్ర‌బాబుకు పెద్ద ఝ‌ల‌క్ ఇచ్చారు. దేశ‌మంతా ఒకేసారి ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని, అదే స‌మ‌యంలో ముంద‌స్తుగా ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని ప్ర‌ధాని మోదీ, సీఎం చంద్ర‌బాబు చెబుతుంటే.. ఈ రెండిటినీ లోకేష్ తేలిక‌గా కొట్టిపారేశారు. అస‌లు ఏక‌కాలంలో అన్నిరాష్ట్రాల‌కూ ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం జ‌రిగే ప‌నికాద‌ని కొట్టిపారేశారు!! […]

ముంద‌స్తుకు సై అన‌డం వెనుక వ్యూహమిదే

ఏపీలో ప‌రిస్థితులు ఇప్పుడిప్పుడే చ‌క్క‌బడుతున్నాయి. తెలంగాణ బంగారు తెలంగాణ‌గా మార్చేందుకు నాయ‌కులు అడుగులు వేస్తున్నారు. ఎన్నిక‌లకు రెండేళ్ల స‌మ‌యం ఉన్నా.. అప్పుడే మూడేళ్లు అయిపోయాయా అనే భావ‌న అంద‌రిలోనూ ఉంది. కానీ మ‌రోసారి ఎన్నిక‌ల‌కు తెలుగు రాష్ట్రాల సీఎంలు సై అంటున్నారు. అటు పార్టీ శ్రేణుల్లోనే కాక‌.. ప్ర‌జ‌ల్లోనూ ఇప్పుడు ముంద‌స్తు ఎన్నిక‌ల ఫీవ‌ర్ పెంచేశారు. ఎన్నిక‌ల హామీలు ఇంకా నెర‌వేర్చ‌లేదు.. మ్యానిఫెస్టోలో ఇచ్చిన‌వి.. ప్ర‌తిపాద‌న‌ల‌కే ప‌రిమిత‌మ‌య్యాయి. కానీ ముంద‌స్తుకు ప్ర‌ధాని మోదీ.. ఓకే అన‌గానే ఇద్ద‌రు […]