బ్రేకింగ్‌: తెలంగాణ‌లో రేప‌టి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌!

కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ దేశంలోని అన్ని రాష్ట్రాల‌ను మ‌ళ్లీ అత‌లా కుత‌లం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ప్ర‌జ‌లు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇక ఈ వైర‌స్‌ను క‌ట్ట‌డి చేసేందుకు ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించ‌గా.. తెలంగాణ ప్ర‌భుత్వం కూడా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. తెలంగాణ‌లో మే 12(రేపు) ఉదయం 10 గంటలనుంచి పది రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 6 […]

కేరళ ‘ ఐరన్ లేడీ’ మృతి…!

కమ్యూనిస్టులు..నిస్వార్థంతో ప్రజాసేవ చేస్తుంటారు. ప్రజల కోసం ధర్నాలు, పోరాటాలు, ఆందోళనలు చేస్తూ ప్రజలకు చెందాల్సిన న్యాయం కోసం పోరాడుతుంటారు. ఆ కోవకు చెందిన ఓ యోధురాలు నేడు అనారోగ్యంతో కన్నుమూశారు. కేరళలోని దిగ్గజ కమ్యూనిస్ట్ కేఆర్ గౌరీ మంగళవారం తన తుదిశ్వాస విడిచారు. కేరళలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూసినట్లు కుటుంబీకులు తెలిపాయి. 102 సంవత్సరాలు వయసుగల ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల ఆమె అనారోగ్యం రీత్యా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. […]

ఎన్టీఆర్‌కు క‌రోనా..చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

చిన్నా, పెద్దా, ఉన్నోడు, లేనోడు, సామాన్యుడు, సెల‌బ్రెటీ అనే తేడా లేకుండా అంద‌రిపై క‌రోనా వైర‌స్ పంజా విసురుతోంది. తాజాగా టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. తనకు కరోనా సోకిందని ఎన్టీఆర్ ట్విట్టర్ లో వెల్లడించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని స్పష్టం చేశారు. అయితే ఎన్టీఆర్‌కు క‌రోనా సోక‌డంపై ఆంధ్రప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు […]

పుదుచ్చేరి సీఎంకి కరోనా పాజిటివ్..!

కరోనా వల్ల పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు కూడా కరోనా బారిన పడిన సందర్భాలు ఉన్నాయి. అదే విధంగా చాలా మంది సీనియర్‌ రాజకీయ నేతలు మృతి చెందిన ఘటనలు కూడా ఉన్నాయి. గతంలో కొందరు సీఎంలకు కూడా కరోనా రావడం కలకలం రేపింది. తాజాగా పుదుచ్చేరికి ప్రమాణ స్వీకారం చేసిన కొత్త సీఎం ఎన్ రంగస్వామి కరోనా బారిన పడ్డారు. మొన్నటికి మొన్న […]

కరోనా బారీన పడిన మరో ఎమ్మెల్యే..!

ఏపీలో కరోనా తన ప్రతాపాన్ని చూపుతోంది. రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోవడం వల్ల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. తాజాగా పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపారు. తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని, ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నానని తెలిపారు. తనతో తిరిగిన కార్యకర్తలు, అభిమానులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని […]

క‌రోనా నేప‌థ్యంలో కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం..!

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తున్నరాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి పని వత్తిడి తగ్గించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. అందులో భాగంగా రాష్ట్ర వ్య్తాప్తంగా దాదాపు 50 వేల మంది ఎంబీబీఎస్ పూర్తిచేసి సిద్దంగా వున్న అర్హులైన వైద్యులనుంచి దరఖాస్తులను ఆహ్వానించాలని నిర్ణయించారు. రెండు, మూడు నెలల కాలానికి డాక్టర్లు, నర్సులు, లాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది ని తక్షణమే నియమించుకోవాలని, కరోనా వైద్యంలో […]

ప్రైవేట్ టీచ‌ర్ల‌కు, రేష‌న్‌దారులకు కేసీఆర్ తీపిక‌బురు..!

క‌రోనా సెకండ్ వేవ్‌తో ప‌రిస్థితి బీతావాహంగా మారిపోయింది. ఆర్థిక వ్య‌వ‌స్త కుప్ప‌కూలిపోయింది. సామాన్యులు ఉపాధి, ఆదాయం లేక నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. రోజువారీ ఖ‌ర్చుల‌కూ నానా తంటాలు ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ మ‌రోసారి మాన‌వ‌త‌ను చాటుకున్నారు. రేష‌న్‌కార్డు దారుల‌కు తీపి క‌బురును అందించారు. తెలంగాణ రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డుదారులందరికీ, మనిషికొక్కరికి ఐదు కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని రెండు నెలల పాటు ఉచితంగా అందచేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. ఇక అదేవిధంగా ప్రైవేట్ టీచ‌ర్ల‌కు […]

ఏపీలో రేషన్ షాపులు బంద్..!

రేషన్‌ డీలర్ల సమస్యలను పరిష్కారించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా రేషన్‌ షాపులను బంద్‌ చేస్తున్నట్లు రేషన్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు మండాది వెంకట్రావు తెలిపారు. ఈ మేరకు శనివారం విడుదల చేసిన ప్రకటనలో రాష్ట్రంలో సగం మంది బియ్యం పంపిణీ వాహనదారులు(ఎండియు) పనిచేయడంలేదని పేర్కొన్నారు. డోర్‌ డెలివరీ రేషన్‌ పంపిణీపై విజిలెన్స్‌ విచారణ నిర్వహించాలని, దీనిలో ఉన్న లోపాలను గుర్తించాలని తెలిపారు. ఎండియు లు చేయాల్సిన రేషన్‌ పంపిణీని డీలర్లు చేయాలని అధికారులు […]

న్యాయ‌వాది దంప‌తుల హ‌త్య‌లో ఈట‌ల ప్ర‌మేయం..?

హత్యకు గురైన న్యాయవాది వామనరావు తండ్రి కిషన్ రావు మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌పై, పెద్దపల్లి చైర్మన్ పుట్టమధుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు వామన రావు హత్యకు పుట్ట మధు దంపతులే సుపారీ ఇచ్చారని ఆరోపించ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వామనరావు దంపతులు వేస్తున్న కేసులకు భయపడే వారిద్దర్ని పుట్ట మధు దంపతులు పరోక్షంగా పాల్గొని హత్య చేయించారని మండిపడ్డారు. తాను దుఃఖంలో ఉన్న సమయంలో రామగిరి ఎస్సై కంప్లైంట్ రాయించుకున్నారని, కేసులో ఎవరెవరు […]