బ్రేకింగ్‌: తెలంగాణ‌లో రేప‌టి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌!

కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ దేశంలోని అన్ని రాష్ట్రాల‌ను మ‌ళ్లీ అత‌లా కుత‌లం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ప్ర‌జ‌లు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇక ఈ వైర‌స్‌ను క‌ట్ట‌డి చేసేందుకు ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించ‌గా.. తెలంగాణ ప్ర‌భుత్వం కూడా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

తెలంగాణ‌లో మే 12(రేపు) ఉదయం 10 గంటలనుంచి పది రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు అన్నీ కార్యకలాపాలకు అవకాశం వుంటుందని.. ఆ త‌ర్వాత రాష్ట్రం లాక్ డౌన్ మోడ్ లోకి వెళ్ల‌నుంది.

ఇక టీకా కొనుగోలు కొరకు గ్లోబల్ టెండర్లను పిలవాలని క్యాబినెట్ నిర్ణయించింది. తెలంగాణలో లాక్‌డౌన్ విధించే అంశంపై అత్యవసరంగా సమావేశమైన మంత్రివర్గం సమావేశం.. ఈ మేరకు తాజాగా నిర్ణయం తీసుకుంది.

Share post:

Latest