ప్రైవేట్ టీచ‌ర్ల‌కు, రేష‌న్‌దారులకు కేసీఆర్ తీపిక‌బురు..!

క‌రోనా సెకండ్ వేవ్‌తో ప‌రిస్థితి బీతావాహంగా మారిపోయింది. ఆర్థిక వ్య‌వ‌స్త కుప్ప‌కూలిపోయింది. సామాన్యులు ఉపాధి, ఆదాయం లేక నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. రోజువారీ ఖ‌ర్చుల‌కూ నానా తంటాలు ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ మ‌రోసారి మాన‌వ‌త‌ను చాటుకున్నారు. రేష‌న్‌కార్డు దారుల‌కు తీపి క‌బురును అందించారు. తెలంగాణ రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డుదారులందరికీ, మనిషికొక్కరికి ఐదు కిలోల చొప్పున రేషన్ బియ్యాన్ని రెండు నెలల పాటు ఉచితంగా అందచేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు.

ఇక అదేవిధంగా ప్రైవేట్ టీచ‌ర్ల‌కు కూడా తీపిక‌బురును అందించారు. రాష్ట్రంలో సుదీర్ఘ‌కాలంగా పాఠ‌శాల‌లు మూత‌ప‌డి ఉండ‌డంతో ల‌క్ష‌లాది మంది ప్రైవేట్ టీచ‌ర్లు రోడ్డున ప‌డ్డారు. ఆన్‌లైన్ క్లాస్‌లు సాగుతున్నా కొద్ది మందికే అవ‌కాశాలు ద‌క్కుతున్నాయి. అదీగాక వేత‌నాలు కూడా అంతంత‌మాత్రంగానే ఇస్తున్నాయి. యాజ‌మాన్యాలు. దీంతో ప్రైవేట్ టీచ‌ర్లు అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే వారిని ఆదుకునేందుకు దేశంలో ఎక్క‌డా లేనివిధంగా సీఎం కేసీఆర్ ముందుకు వ‌చ్చారు. ప్రైవేటు టీచర్లకు నెలకు 2000 రూపాయలు, 25 కిలోల బియ్యాన్నిఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. అందుకు ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌గా 2ల‌క్ష‌ల‌కు పైగా విజ్ఞ‌ప్తులు వ‌చ్చాయి. అందులో అర్హులైన దాదాపు లక్షా ఇరవై వేల మంది ఇప్పటికే ప్ర‌భుత్వ సాయాన్ని అంద‌జేస్తున్నారు. అర్హ‌త‌లు లేని కార‌ణంగా మిగిలిన మరో 80 వేల మంది ప్రయివేటు టీచర్లకు చెల్లించ‌లేదు. తాజాగా వారికి సైతం 2వేలు, 25 కిలోల బియ్యాన్ని అందచేయాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.