వాట్.. అజిత్ తో ఉన్న ఈ చిన్నది.. ఇప్పుడు ఓ హీరోయినా.. ఎవరో గుర్తుపట్టారా..?!

తమిళ్ స్టార్ హీరో అజిత్‌కు టాలీవుడ్‌లో ప్రత్యేక పరిచ‌యం అవసరం లేదు. ఇటీవల కాలంలో అజిత్‌ గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. అజిత్ అనారోగ్యానికి గురయ్యాడు అంటూ.. ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు అంటూ.. వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే అజిత్ హాస్పిటల్‌కు వెళ్ళిన విషయం నిజమే కానీ.. జనరల్ చెకప్ కోసమే ఆయన అక్కడకు వెళ్లారని టీం క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే అజిత్ సినిమాలకు కోలీవుడ్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. ఆయన సినిమాల కోసం అక్కడి ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే ఆయన డబ్బింగ్ సినిమాలు తెలుగులోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అజిత్ కు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Yuvina Parthavi - Photos, Videos, Birthday, Latest News, Height In Feet - FilmiBeat

ఇదిలా ఉంటే తాజాగా.. హీరో అజిత్‌కు సంబంధించిన ఓ ఫోటో నెటింట‌ వైరల్‌గా మారింది. ఇంతకీ ఈ పై ఫోటోలో అజిత్ ఓడిలో కూర్చుని ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఆమె ఇప్పుడు ఓ హీరోయిన్. అజిత్ నటించిన చాలా సినిమాల్లో చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటిస్తూ ఉంటారు. ఈ చిన్నారి కూడా ఒకప్పుడు ఆయన సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ప్రస్తుతం హీరోయిన్గా మారింది. ఆమె అందంతో కుర్రాళ‌ను మైమరిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఎవరు ఇప్పటికైనా గుర్తుపట్టారా.. ఈమె అజిత్ హీరోగా నటించిన వీరం సినిమాలో అతని కూతురుగా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన యువీణ.

ప్రస్తుతం యువీణ హీరోయిన్గా మారి పలు సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తుంది. ఏ కమల్ అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించి మెప్పించింది. తాజాగా యువీణ టీనేజ్ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన యువీణ ఇటీవల వచ్చిన సైరన్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. చూడ చక్కని అందమైన రూపంతో ఆకట్టుకుంటున్న యువీణ‌ నటనకు ప్రేక్షకుల్లో మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం యువీణ యంగ్ ఏజ్ ఫొటోస్ నెట్టింట తెగ చక్కెరలు కొడుతున్నాయి. మీరు ఓ లుక్ వేయండి.

 

View this post on Instagram

 

A post shared by Yuvina Parthavi (@yuvinaparthavi)