అనుష్క చేస్తున్న మలయాళ సినిమా.. రెమ్యూనరేషన్ తెలిస్తే నోరెళబెడతారు..!!

టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది అనుష్క శెట్టి. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ క్రేజీ బ్యూటీగా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ.. దాదాపు తెలుగు స్టార్ హీరోల అందరి స‌రస‌న నటించి మెప్పించింది. ఇప్పటికే మూడు ఫిలింఫేర్ అవార్డ్స్, 2 నంది అవార్డ్స్. రెండు సైమా అవార్డులను దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన బాహుబలి సినిమాలోనూ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ బ్యూటీగా మారిన అనుష్క.. ఈ మూవీ తర్వాత చాలా కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.

Kathanar - The Wild Sorcerer': Jayasurya welcomes Anushka Shetty on board;  fans wonder if she is playing Neeli! | Malayalam Movie News - Times of India

అలాగే సోషల్ మీడియాలోనూ ఆమెకు సంబంధించిన ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ అంత చాలా నిరాశ చెందారు. ఆమె అధిక బరువుతో అనారోగ్యం పాలయ్యిందని.. అందుకే సినిమాలకు దూరంగా ఉంటూ కెమెరాలకు చిక్కకుండా తిరుగుతుంది అంటూ.. పలు వార్తలు వైరల్ అయ్యాయి. అయితే గతేడాది నవీన్ పోలిశెట్టితో కలిసి.. మిస్ శెట్టి మిస్టర్ పోలీశెట్టి సినిమాతో ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చింది. ఇక తాజాగా మరో మలయాళ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

Anushka Shetty joins the sets of 'Kathanar-The Wild Sorcerer' - The South  First

కథనార్ ది వైల్డ్ సోర్సరర్ అనే థ్రిల్లర్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు రాజీన్ థామస్ దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు అనుష్క రెమ్యున‌రేష‌న్ ఎంత తీసుకుంటున్నారు అనే అంశం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమాలో అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా కోసం అనుష్క రూ.5 నుంచి 6 కోట్లు డిమాండ్ చేస్తునట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ వార్త నెటింట వైరల్ అవ్వడంతో.. అంత ఆశ్చర్యపోతున్నారు.