పవన్ పిలిస్తే ప్రచారానికి రెడీ.. అనసూయ పొలిటికల్ కామెంట్స్..!!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల టైం దగ్గర పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పొలిటికల్ హీట్ రాజుకుంది. ఇప్పటికే అన్ని పొలిటికల్ పార్టీలు పార్టీ ప్రచారాలను వేగవంతం చేశాయి. కొంతమంది నాయకులు సినీ సెలబ్రిటీస్ మద్దతు కోరుకుంటూ.. వారి సహాయం తీసుకుంటున్న సంగతి చూస్తూనే ఉన్నాం. ఈ క్ర‌మంలో బుల్లితెర యాంకర్ గా మంచి సక్సెస్ సాధించి.. మరోపక్క వరుస‌ సినిమాల్లో అవకాశాలను అందుకుంటూ బిజీగా గడుపుతున్న అనసూయ.. ఇటీవల ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొని పొలిటికల్ సపోర్ట్ పై చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్‌గా మారాయి. అనసూయ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాజకీయాల గురించి ఎదురైన ఎదురైన ప్రశ్నకు స్పందించింది.

Anasuya Bharadwaj in MasterChef Telugu: A confident start

రాజకీయాల గురించి మాట్లాడడం వివాదం అవ్వచ్చు. కానీ వీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను అంటూ ఈమె రాజకీయాల గురించి వివరించింది. నేను తప్పై ఉండవచ్చు. నాకు లీడర్స్ తోనే పని. పొలిటికల్ పార్టీతో కాదు. పవన్ కళ్యాణ్ గొప్ప నాయకులు. ఆయన ప్రచారం చేయమని పిలుస్తే నేను తప్పకుండా వెళ్తా. జబర్దస్త్ కార్యక్రమంలో పనిచేసేటప్పుడు నాకు నాగబాబుగారు, రోజా గారు ఇద్దరు కూడా చాలా క్లోజ్.. ఇటు నుంచి రోజా గారు పిలిస్తే నేను పార్టీలో భాగంగా చూడ‌ను. నాయకుల పరంగా చూసేవారికి మద్దతు తెలుపుతా అంటూ వివరించింది. నాకు చాలా పార్టీలో నుంచి చాలామంది లీడర్లు తెలుసు. వాళ్ళని అభిమానిస్తా.. వాళ్ళ ఇద్ద‌రు పిలుపునిస్తే ఆ రెండు పార్టీలకి వెళ్తా.. అది నా ఆసక్తిని బట్టి ఉంటుంది. అదే నా వృత్తి కాదు అంటూ వివరించింది.

anasuya bharadwaj made some interesting political comments extends her  support to janasena leader pawan kalyan ksr

నేను దేనిని నమ్ముతాను దాన్నిబట్టే సపోర్ట్ చేస్తా.. నాకు రాజకీయాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు.. కానీ మా నాన్న రాజకీయాల్లో ఉండేవాళ్ళు.. నా వల్లే మా నాన్న పాలిటిక్స్ జోలికి వెళ్లడం మానేశారు అంటూ ఆమె వివరించింది. నాకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు కానీ నేను ఒక సొసైటీలో ఉన్న కాబట్టి.. ఈ సొసైటీకి ఒక మంచి నాయకుడు కావాలని కోరుకుంటా. ఇక జనసేన నుంచి పిలుపు వస్తే నేను కచ్చితంగా వెళ్తా అంటూ ఆమె వివరించింది. పవన్ కళ్యాణ్ ఓ మంచి లీడర్ కాబట్టి.. ఆయన పిలిస్తే నేను తప్పకుండా మద్దతుగా నిలుస్తానంటూ అనసూయ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.