బాలీవుడ్ వద్దనుకోవడానికి కారణం అదే.. త్రిష షాకింగ్ కామెంట్స్..?!

సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి స‌ర‌సన నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ బ్యూటీగా తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది. అయితే గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరమైన ఈ ముద్దుగుమ్మ.. గతేడాది తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్‌ సినిమాతో సక్సెస్ఫుల్ సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ.. సౌత్ సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్నప్పటికీ.. బాలీవుడ్‌కి మాత్రం దూరంగా ఉంటుంది.

Happy Birthday, Trisha: Reasons why fans call the actress an evergreen South  queen | The Times of India

అయితే ప్రస్తుతం ఉన్న సౌత్ స్టార్ హీరోయిన్స్ అంతా బాలీవుడట్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆరాటపడుతున్నారు. అయితే త్రిష మాత్రం హిందీలో కూడా అవకాశాలు వస్తున్నాయని.. అయితే అక్కడ సినిమాలను వద్దనుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై త్రిష స్పందిస్తూ.. కంటమిఠ‌ సినిమాతో హిందీలో అడుగు పెట్టా. ఆ సినిమా ఆశించిన రేంజ్ లో సక్సెస్ అందలేదు. అయితే ఈ సినిమా ఫెయిల్యూర్ వల్లే నాకు బాలీవుడ్ లో అవకాశాలు రాలేదని.. చాలామంది అనుకుంటున్నారు.

Trisha interview on 'Leo': 'Working with Vijay feels like coming home' -  The Hindu

అందులో నిజం లేదు.. నాకు అవకాశాలు వచ్చినా.. కుటుంబం మొత్తాన్ని ముంబైకి సడన్గా మార్చడానికి మనసు ఒప్పుకోలేదు. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తే సౌత్ లో చాలా సినిమా ఛాన్స్ లు మిస్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆ టైంలో నాకు సౌత్ లో ఉన్న క్రేజ్ దృష్ట్యా.. బాలీవుడ్ సినిమాలను వదిలేసుకున్నా అంటూ ఆమె వివరించింది. ప్రస్తుతం త్రిష‌.. కమల్ హాసన్ తగ్‌ లైఫ్, చిరంజీవి.. విశ్వంభరా, అజిత్ విడముయ్య‌ర్చి సినిమాల్లో హీరోయిన్గా నటిస్తూ బిజీగా గడుపుతుంది.