అనుపమ పై ట్రోల్స్ కు.. ఇల్లు గాడి స్ట్రాంగ్ కౌంటర్.. ఒక్కొక్కడికి ఇచ్చి పడేసాడుగా..!!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఒకప్పుడు హోమ్లీ బ్యూటీగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. అయితే ప్రస్తుతం మారుతున్న ట్రెండ్‌కు తగ్గట్టుగానే ఆమె కూడా తన ఆలోచనలను మార్చుకుంటుంది. ఇటీవల టిల్లు స్క్వేర్ లో ఈమె కాస్త బోల్డ్ రొమాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ఇందులో లిప్ కిస్లు, రొమాంటిక్ సీన్లలో కూడా అనుపమ నటించింది. దీంతో అనుపమపై పలువురు నెటిజ‌న్లు విపరీతంగా ట్రోల్స్ చేస్తూ ఆమెను టార్గెట్ చేశారు. ఇటీవల అనుపమ గ్లామర్‌ షోపై స్పందిస్తూ ఎప్పుడు వెజ్జ తినలేము కదా.. అప్పుడప్పుడు నాన్ వెజ్ కూడా తినాలి అంటూ కామెంట్ చేసింది.

వాటిపై కౌంటర్ ఇస్తూ ట్రోల్స్ చేస్తూ విపరీతంగా ఆడేసుకుంటున్నారు. అయితే లేటెస్ట్ గా టిల్లు స్క్వేర్ సినిమా నుంచి మరో కొత్త పోస్టర్ రిలీజ్ అయింది. ఇందులో సిద్దు, అనుపమ‌ పరమేశ్వరన్ లిప్ కిస్ పెట్టుకుంటూ కనిపించారు. అనుపమ ఓ చెయ్యి కాస్త అసభ్యకరంగా అనిపించడంతో.. మరోసారి అనుపమను ట్రోల్స్ తో ఆడేసుకుంటున్నారు. ఇంకా ఈ ట్రోల్స్ నడుస్తూనే ఉన్నాయి. తాజాగా దీనిపై హీరో సిద్దు జొన్నలగడ్డ రియాక్ట్ అయ్యారు.

తాజాగా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్.. హైదరాబాద్ ఐటిసి కాహినూర్ లో ఘనంగా జరిగింది. ఈవెంట్ కి హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ హాజరు కాలేదు. సిద్దు మాట్లాడుతూ అనుపమ ఈవెంట్ కు రాకపోవడానికి ఒక కారణం ఉంది. నిన్న మూవీ నుంచి ఓ పోస్టర్ రిలీజ్ అయింది. అందులో అనుపమ హ్యాండ్ పోసిషన్ గురించి రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. హీరో,హిరోయిన్లకు సంబంధించిన ఇలాంటి విషయాల్లో అందరి ఫోకస్ బాగా ఉంటుంది. పది రకాలుగా మాట్లాడడంలో ముందుంటారు.

దానికి నేనేమీ అనను.. కానీ ఫిమేల్ కోస్టార్, ఫిమేల్ యాక్టర్స్ గురించి కామెంట్స్ పెట్టేటప్పుడు.. అమ్మాయిని మనం ఫ్లడ్‌ చేసేటప్పుడు దానికి ఓ లిమిట్ ఉంటుందని.. వారు ఎంజాయ్ చేసే విధంగా మనం చేసే ఫ్లడింగ్ ఉండాలని.. ఇబ్బంది పడేలా అనిపించకూడదంటూ ఫైర్ అయ్యాడు. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. ఇక చూసినవన్నీ నిజాలు కాదు.. కొంతమంది ఏం పని లేక ఇంటర్నెట్ చేతిలో ఉంది క‌దా అని చేసే చెత్త కామెంట్లు.. అంటూ వివరించాడు. ఈ విషయంలో హెల్తీ వెదర్ మెయింటైన్ చేద్దాం అంటూ రిక్వెస్ట్ చేశాడు. ప్రస్తుతం సిద్దు చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారాయి.