హిస్టరీలో ఫస్ట్ టైం సీరియల్ ఫ్రీ రిలీజ్.. అది వంటలు అక్క స్టామినా అంటూ..

తెలుగు బుల్లితెరలో ఏ సీరియల్‌కు రానంత క్రేజీ స్టార్ మా లో టెలికాస్ట్ అయ్యే కార్తీక దీపం కు వచ్చింది. ఆ సీరియల్ వ్యూస్ప‌రంగానేకాదు.. మ‌రెనో సంచ‌ల‌నాలు సృష్టించింది. ఈ సీరియల్ స్టోరీలో హీరోయిన్ రోల్ ఫ్యామిలీ ఆడియ‌న్స్ అంద‌రిని ఆకట్టుకుంది. ఇక ఈ సీరియల్‌ సీక్వెల్ త్వ‌ర‌లో రాబోతుంది. త్వరలోనే ఈ సీరియ‌ల్ స్టార్ట్ అయ్యి చరిత్రలోనే సరికొత్త రికార్డు నెలకొల్పడానికి సిద్దం అవుతుంది. ఇక సీరియల్ సీక్వెల్ ప్రారంశంలో ఆగంగా ‘ప్రీ రిలీజ్ ఈబెంట్‌ను నిర్వహించనున్నారట ప్రొడెక్ష‌న్ టీం. కార్తీక దీపం సీక్వెల్‌గా ‘కార్తీక దీపం ఇది నవ వసంతం’ పేరిట ఓ కొత్త కంటెంట్‌తో వస్తోంది. ఈనెల 25 నుంచి స్టార్ మా లో ఈ సీరియ‌ల్ ప్రసారం కానుంది.

కార్తీక దీపం బృందం సీక్వెల్‌కు ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించనున్న‌ట్లు తాజాగా ఓ ప్రకటన రిలీజ్ అయ్యింది. శుక్రవారం (మార్చి 21) మధ్యాహ్నం హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ఈ వేడుక గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి ఈ వేడుక మొద‌లుకానుంది. ఈ వేడుకకు సీరియల్‌ ప్రధాన పాత్రధారులు నిరుపమ్‌, ప్రేమీ విశ్వనాథ్‌, శోభా శెట్టి తదితరులతోపాటు సీరియల్స్‌ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు హాజ‌రుకానున్నారు. ఇక కార్తీక దీపం మరో రికార్డ్ సృష్టించ‌నుంది. ఈ సీరియల్‌ను ఇతర భాషల్లోను కూడా రీమేక్ చేయ‌నున్నార‌ట‌. తమిళ్‌ జీ ఛానల్‌లో తమిళ భాషలో ఈ సీరియల్‌ ఇప్పటికే టిలీకాస్ట్ అవుతోంది.

త్వరలోనే మిగతా భాషల్లో కూడా రీమేక్ చేయ‌నున్నారు. తెలుగు సీరియల్స్‌ ఇతర భాషల్లోకి రీమేక్ చేయ‌డం చాలా రేర్‌గా జ‌రుగుతుంది. అలాంటి అరుదైన ఘనతను ఈ సీరియల్‌ సొంతం చేసుకోనుంది. ‘కార్తీక దీపం’ సీరియల్‌ మొదటి భాగంలో డాక్టర్‌ బాబు, వంటలక్క, మోనిత అనే పాత్రల చుట్టూ ర‌న్‌కాగా.. రెండో భాగంలో డాక్టర్‌ బాబు, వంటలక్కకు పుట్టిన పిల్లల భవిష్యత్‌ విషయమై ఉంటుందట. సీరియల్స్ స్టోరీ ముందే ఎవ‌రికి తెలియ‌దు. మొదటి భాగానికి.. రెండో భాగానికి.. మధ్య అనుబంధం కొనసాగిస్తూ దాదాపు మూడేళ్లకు సరిపడా ఎపిసోడ్‌లు సిద్ధం చేసుకున్నారని తెలుస్తుంది. మరి మొదటి భాగం లానే దీని సీక్వెల్‌ బుల్లితెర సీరియ‌ల్ ప్రియుల‌ను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.