కవలలకు జన్మనివ్వనున్న అమలాపాల్.. చిన్న హింట్ తో మేటర్ లిక్.. పోస్ట్ వైరల్..

డస్కి బ్యూటీ అమలాపాల్ ఒకప్పుడు టాలీవుడ్‌లో వ‌రుస‌ అవకాశాలు అందుకుంటూ ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఈ ముద్దుగుమ్మ అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి టాలీవుడ్ స్టార్ హీరోల సరసన కూడా నటించి మెప్పించింది. అయితే సినిమాల విషయంలో కంటే ఆమె పర్సనల్ విషయం మరింత నాటకీయంగా జరిగింది. త‌న లైఫ్‌లో ఎన్నో స‌మ‌స్య‌లు , వివాదాల అమెను చుట్టుముట్టినా వాటి నుంచి మరింత స్ట్రాంగ్ గా ఉండడం నేర్చుకుంది. అంతేకాదు అమలాపాల్ వెండితెరపై కూడా ఎన్నో బోల్డ్ సినిమాల్లో మెప్పించింది. పాత్ర నచ్చితే న్యూడ్ గా నటించేందుకైనా వెనకాడని ఈ ముద్దుగుమ్మ.. ఆడై సినిమాలో చాలా సన్నివేశాలలో న్యూడ్‌గా కనిపించింది. తెలుగులో ఆమె పేరుతో ఈ మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీలో న్యూడ్ గా నటించడంపై కొందరు అభినందించ‌గా.. మరి కొందరు దారుణంగా ట్రోల్స్ చేశారు. వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోయింది.

ఇక ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ కుర్రాళ్లను ఆకట్టుకునేలా హాట్ ఫోసులకు స్టిల్స్ ఇచ్చే ఈ ముద్దుగుమ్మ.. బికినీ నుంచి ట్రెడిషనల్ లుక్ వరకు అన్నిటినీ కవర్ చేస్తుంది. ప్రేక్షకులకు గ్లామర్ ట్రీట్‌ ఇస్తూ ఉంటుంది. 2014లో అమలాపాల్ దర్శకుడు ఏ ఎల్ విజయని వివాహం చేసుకోగా.. ఏవో కారణాలతో వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ఆమలాపాల్ కొంతకాలం సినిమాలో నటిస్తూ బిజీగా గడిపింది. అయితే ఇటీవల అమలాపాల్ రెండో వివాహం చేసుకుంది. రెండు నెలల క్రితం జగత్ అనే వ్యక్తిని వివాహం చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. పెళ్లైన రెండు నెలలకు ప్రెగ్నెన్సీ అంటూ అనౌన్స్మెంట్ ఇచ్చింది. బేబీ బంప్ ఫోటోలు కూడా వైరల్ అవ్వడంతో అనేక రూమర్స్ నెట్టింటి వైరల్ అయ్యాయి. అమలాపాల్ ప్రెగ్నెంట్ అయ్యాకే వివాహం చేస్తుందంటూ వార్త‌లు వినిపించాయి.

ఏది ఏమైనా అమలాపాల్ జాగత్‌ జంట త్వరలో తల్లిదండ్రులు కానున్నారు. గర్భవతి అయిన అమల తన బేబీ బంప్‌ ఫొటోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తుంది. తాజాగా ఆమె చేసిన ఫోటోషూట్ పోస్ట్లు బట్టి అమలాపాల్‌కి ట్వీన్స్ పుట్టబోతున్నారంటూ ప్రేక్షకుల్లో సందేహాలు మొదలయ్యాయి. ముద్దులొలికిచ్చించే ఓ బుజ్జి పాపను ఎత్తుకొని ఫొటోస్ కు స్టిల్స్ ఇచ్చిన‌ ఆమె ఈ ఫొటోస్‌తో పాటు 2 హ్యాపీ కిడ్స్ అంటూ రాసుకొచ్చింది. తనని కూడా కిడ్ లాగా భావిస్తూ ఆ బుజ్జి పాప తాను కలిపి ఇద్దరు హ్యాపీ కిడ్స్ అంటూ ఆమె కామెంట్ చేసిందని.. మ‌రికొంత‌మంది ఆమెకు కవలలు జన్మించనున్నారంటూ హింట్‌ ఇచ్చిందంటూ భావిస్తున్నారు.