ఛీ.. ఈ సినిమాలో అనవసరంగా నటించ అని చిరంజీవి అనుకున్నా మూవీ ఏంటో తెలుసా..?!

ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి మొదటి వరుసలో ఉంటారు. ఓ సాధారణ వ్యక్తిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి మెగాస్టార్ గా ఎదగడం అనేది సాధారణ విషయం కాదు. దానికి అహర్నిశ‌లు శ్రమించాల్సి ఉంటుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమా పైనే శ్వాస, ధ్యాస నిమగ్నం చేసి మరి అహర్నిశలు శ్రమించేవారు. మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా నటించిన చిరు.. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని హీరోగా అవకాశాలు అందుకున్నాడు. వరుస సినిమాతో సక్సెస్ లు అందుకని స్టార్ హీరోగా ఎదిగాడు. ఒక మనిషి దీనిపైన అన్న‌ శ్రద్ధ పెట్టి దానికోసం శ్రమిస్తే సాధ్యం కానిది అంటూ ఏదీ ఉండదని చిరంజీవి ప్రూవ్ చేశాడు. ఆయనను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పటికే ఇండ‌స్ట్రీలోకి ఎంతో మంది అడుగుపెట్టి సక్సెస్ సాధించారు.

పలు వేదికలపై చిరంజీవి ఇన్స్పిరేషన్తోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినట్టు వారు వివరించారు కూడా. అయితే అలాంటి చిరంజీవి ఓ సినిమాను న‌టించే టైంలో అనవసరంగా ఈ సినిమాకు ఒప్ప‌కుని త‌ప్పుచేశా అని భావించారట. ఇంతకీ ఆ సినిమా ఏంటో చూద్దాం. చిరు వరుస సినిమాలతో హిట్లు అందుకుంటున్న టైంలోనే యండమూరి వీరేంద్రనాథ్ డైరెక్షన్లో స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టైంలో యండ‌మూరికి డైరెక్షన్ పై అసలు పట్టు లేకపోవడంతో.. సరిగ్గా కథను హ్యాండిల్ చేయలేకపోయాడట. ఈ కారణంగానే సినిమా ప్లాప్ అయ్యిందంటారు.

ఇక అవి సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడు.. చిరంజీవి అనవసరంగా ఈ సినిమాను ఒప్పుకొని తప్పు చేసానని.. చాలాసార్లు అనుకున్నారట. అయినా కూడా ప్రొడ్యూసర్లకే నష్టం రాకూడదనే ఉద్దేశంతో ఈ సినిమాను పూర్తి చేశాడు. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత డిజాస్టర్ గా మిగిలింది. ఇక ఈ సినిమా ప్రజలు చూసిన తర్వాత చిరు మరింత బాధ పడినట్లు వార్తలు వినిపించాయి. వాస్తవానికి యండమూరిని ఎంకరేజ్ చేసే ఆయనను డైరెక్షన్ చేసే దిశగా నడిపించినది కూడా చిరంజీవేనట. కానీ మొదట సినిమా కావడంతో.. ఆయన క‌థ హ్యాండిల్ చేయలేక మధ్యలోనే చేతులెత్తేసారు. దీంతో షూటింగ్ అంతా కన్ఫ్యూజ్ అవ్వడం చివరికి ఆ మూవీ ఫ్లాప్ అవ్వ‌డం జరిగింది.