నా మూవీకి డేట్స్ ఇచ్చి బిగ్ బాస్‌కి వెళ్ళింది.. ఆమె వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేసాం.. శ్రీ విష్ణు షాకింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం హీరోగా తన సత్తా చాటుతున్నాడు శ్రీ విష్ణు. చిన్న సినిమాల్లో హీరోగా నటిస్తూనే.. కొన్ని సినిమాలతో మంచి సక్సెస్ సాధించి.. భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక శ్రీ విష్ణు కామెడీ టచ్ ఉన్న లవ్ స్టోరీ లతో పాటు, పలు సందర్భాల్లో కంటెంట్‌ స్ట్రాంగ్ గా ఉన్న ఎమోషనల్ సినిమాలో కూడా నటించాడు. గత ఏడాది శ్రీ విష్ణు సామజవరగమన సినిమా కామెడీ ఎంటర్టైనర్గా రిలీజై సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్‌ల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమా హిట్ తర్వాత శ్రీ విష్ణు తన కథల విషయంలో ఎంతో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. డిఫరెంట్‌ స్టోరీస్‌తో పాటు తన పాత్రకు బలం ఉందనిపిస్తేనే అది ఎలాంటి సినిమా అయినా దానిలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడని తెలుస్తుంది.

ఇక తాజాగా శ్రీవిష్ణు నటించిన మూవీ ఓం భీమ్ బుష్. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కామెడీ ఎంటర్టైనర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయి పాజిటివ్ బజ్‌ క్రియేట్ చేసింది. సైంటిస్ట్ కావాలనే కోరికతో ముగ్గురు స్టూడెంట్స్‌ భైరవపురం గ్రామానికి వెళ్తారు.. అక్కడ ఏం జరిగిందో.. అనే కథతోనే ఈ సినిమా రూపొందించారు. శ్రీహర్ష‌ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీ విష్ణు ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. షూటింగ్ టైంలో ఎదురైనా సమస్యలను వివరించాడు. ఇక ఈ మూవీలో శ్రీ విష్ణు, రాహుల్, ప్రీయ‌ద‌ర్శి ముగ్గురు ప్రధాన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

ముగ్గురు డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో షూటింగ్ చాలా ఇబ్బంది అయిందని.. ముగ్గురం బిజీగా ఉండి దర్శి ఉన్న టైంలో నేను లేకపోవడం.. నేను ఉన్న టైంలో రాహుల్ లేకపోవడం.. ఇలా ఎన్నోసార్లు ఇబ్బంది కలిగిందని.. ముగ్గురం ఉన్న టైంలో హీరోయిన్ లేదంటూ వివరించాడు. హీరోయిన్ విషయంలో ఎన్నో సమస్యలు ఎదురయ్యాయని.. శ్రీ విష్ణువు చెప్పుకొచ్చాడు. ఈ మూవీలో ఆయేష ఖాన్ హీరోయిన్గా కనిపించనుంది. ఇక ఈ సినిమాకి డేట్స్ ఇచ్చిన తర్వాత ఆమెకు బిగ్ బాస్ ఆఫర్ రావడంతో.. అక్కడికి వెళ్ళిపోయింది. అయితే ఎవరికి ఒక్క మాట కూడా చెప్పలేదు. ఫోన్ చేస్తే ఫోన్ కలవలేదు.. తర్వాత ఆమె బిగ్ బాస్ కు వెళ్లిందని తెలిసింది. దీంతో షూటింగ్ మరింత ఆలస్యం అయింది. ఆమె వల్ల చాలా సమస్యలు ఎదుర్కొన్నం అంటూ శ్రీ విష్ణు వివరించాడు. ఇక ఆయేషా బిగ్ బాస్ 17 హిందీలో పాల్గొంది. అయితే ఆమె కాదు ఇంకా చాలామంది నటులు ఈ సినిమాకి వర్క్ చేస్తూ మధ్యలో బిగ్ బాస్ కి వెళ్ళారంట వివరించాడు శ్రీ విష్ణు. వాళ్లందరికీ ఇప్పుడు మంచి గుర్తింపు వచ్చిందని చెప్పుకొచ్చాడు.