మెగాస్టార్ తో పాటు మరో స్టార్ సినిమా ఛాన్స్ రిజెక్ట్ చేసిన కుమారి ఆంటీ.. షాకింగ్ కామెంట్స్ వైరల్..

కుమారి ఆంటీ.. ప్రస్తుతం ఈ పేరు నెటింట మారుమోగిపోతుంది. మీది మొత్తం వెయ్యి అయింది.. రెండు లివర్స్ ఎక్స్ట్రా అని ఒక్క డైలాగ్‌తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన కుమారి ఆంటీ.. ఏ రేంజ్ లో వైరల్ గా మారిందో అందరికీ తెలుసు. ఒక్క వీడియోతో ఆమె తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి వరకు వెళ్లిపోయేందంటే దీనిబ‌ట్టి అరంధం చేసుకోవ‌చ్చు.. ఆమె ఏ రేంజఃలో పాపుల‌ర్ అయ్యిందో. కాగా ఫేమస్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు వరుస ఇంటర్వ్యూలో హాజరవుతూ సందడి చేస్తున్న కుమారి ఆంటీ.. ఇటీవల కార్తీకదీపం సీరియల్ గ్రాండ్గా నిర్వహించిన ఈవెంట్లో సందడి చేసింది.

ఒక న్యూస్ ఛానల్ కుమారి ఆంటీ ని తాజాగా ఇంటర్వ్యూ చేసింది. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి స్పందించిన అనంతరం మీ బిజినెస్ ఎలా సాగుతుంది అంటూ యాంకర్ ప్రశ్నించాడు. అలాగే సీరియల్స్ లో సినిమాల్లో ఛాన్స్‌లు ఏమైనా కొత్తవి వస్తున్నాయా అంటూ ఇంటర్వ్యూ అడిగాడు. దీనిపై కుమారి ఆంటీ స్పందిస్తూ కొందరు ఛానల్ వాళ్ళు వచ్చి అడిగారు. ఇక మా పిల్లలు చెప్పడంతో సీరియల్స్ కు నటించాను. అంతకుముందే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పాల్గొన్నా. ఇంద్రజ, ఆది వీళ్లందరితో కలిసి చేశాను. కానీ నటించేటప్పుడు కొంత ఇబ్బంది అనిపించింది. ఫస్ట్ టైం కదా అందుకే అలా భావించా అంటూ చెప్పుకొచ్చింది.

సీరియల్స్ లో నటించడానికి ఏదైనా డబ్బు తీసుకున్నారా.. అని అడగ్గా నేను ఒక్క పైసా కూడా అడగలేదు.. కానీ నేను అక్కడికి తీసుకెళ్ళిన ఫుడ్‌కి మనీ ఇచ్చారు అంటూ వివరించింది. అయితే సినిమాల్లో ఏం అవకాశాలు రాలేదా.. అని అడగ‌గా.. రెండు సినిమా ఛాన్స్ లు వచ్చాయి. నా ఫుడ్ వ్యాపారం వల్ల నాకు కుదరదని వాళ్లకు చెప్పేసా. కొన్ని డేస్ బిజినెస్ ఆపి మూవీలో నటించమన్నారు.. కానీ నాకెందుకో అది కరెక్ట్ కాదనిపించింది. నాకు జీవితం ఇచ్చిన ఫుడ్ కోర్ట్ ను వదిలిపెట్టనని చెప్పేశా అంటూ కుమారి ఆంటీ వివరించింది. అయితే ఈ రెండు సినిమాలు చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు అని నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.