“ఆ ఇద్దరు తెలుగు హీరోలు నా కొంప ముంచేశారు”.. రకుల్ ప్రీత్ షాకింగ్ కామెంట్స్..!!

రకుల్ ప్రీత్ సింగ్..  ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు,  సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ ఆల్ అందరి హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది . బాలీవుడ్ ఇండస్ట్రీలో బడా హీరోయిన్గా రాజ్యమేలేసింది.  బోల్డ్ రోల్స్ ని కూడా అవలీలగా చేసేసి బోల్డ్ కా బాప్ అనే రేంజ్ లో బాలీవుడ్ జనాలను బెదరగొట్టేసింది.

త్వరలోనే తన ప్రియుడు జాకీ భగ్నానిని  పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.  ఇలాంటి క్రమంలోనే  రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ స్టార్ హీరోస్ అల్లు అర్జున్ – తారక్ – చరణ్ పై సంచలన కామెంట్స్ చేసింది . వాళ్ళ కారణంగా ఒక మంచి సినిమాను వదులుకోవాల్సి వచ్చింది అంటూ పరోక్షకంగా కౌంటర్ వేసింది .

బాలీవుడ్లో ఎంఎస్ ధోని ది అన్ టోల్డ్ స్టోరీ సినిమా ఎంత హిట్ అయిందో మనకు తెలిసిందే.  నిజానికి ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ నటించిన రకుల్ ప్రీత్ సింగ్ .. తెలుగులో సరైనోడు -ధ్రువ -నాన్నకు ప్రేమతో లాంటి సినిమాలలో నటిస్తున్న టైం లో ఈ ఆఫర్ రావడంతో కాల్ షీట్స్ అడ్జస్ట్ చేసుకోలేక ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందట.  ఒకవేళ ఆ సినిమా చేసుంటే బాలీవుడ్లో ఇంకా పెద్ద స్థానాన్ని రీచ్ అయ్యి ఉండే దాన్ని అంటూ చెప్పుకొచ్చింది.  రకుల్ ప్రీత్ సింగ్ ప్రజెంట్ ఇవే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!