గుంటూరు కారం-హనుమాన్-సైంధవ్-నా సామీ రంగా.. ఏ సినిమా హిట్ ..ఏ సినిమా ఫట్..?

సంక్రాంతి కానుకగా ఈసారి బాక్స్ ఆఫీస్ వద్ద టఫ్ ఫైట్ నెలకొంది . మహేష్ బాబు నటించిన గుంటూరు కారం తేజా సజ్జ నటించిన హనుమాన్ .. నాగార్జున నటించిన సైధవ్.. అక్కినేని నాగార్జున నటించిన నా సామిరంగా.. నాలుగు సినిమాలు సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయి . అయితే ఈ నాలుగు సినిమాలలో జనాలను మెప్పించిన సినిమా ఏది అన్నది ఇప్పుడు హాట్  టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

చాలామంది గుంటూరు కారం – హనుమాన్ సినిమాలకే సపోర్ట్ చేస్తున్నారు . సైంధవ్ – నా సామీ రంగా గా సినిమాలను అసలు లెక్కలోకే తీసుకోవడం లేదు. హనుమాన్ సినిమా ది బెస్ట్ గా సంక్రాంతి విన్నర్ గా నిలిచింది . పెట్టిన తక్కువ బడ్జెట్ కి ప్రాఫిట్స్ తీసుకొస్తూ టాక్ పరంగా కూడా అభిమానులను ఆకట్టుకుంటుంది . గుంటూరు కారం కలెక్షన్స్ పరంగా కుమ్మేస్తున్న సినిమాలో పెద్దగా మ్యాటర్ లేదని..

సినిమాలో నాటి డైలాగ్స్ శ్రీలీల డాన్స్ తప్పిస్తే మరి ఏమి చూడలేమని కొట్టి పడేస్తున్నారు జనాలు . ఈ క్రమంలోనే  నాలుగు సినిమాలలో హనుమాన్ సినిమాకి ఎక్కువ మార్కులు వేస్తున్నారు . ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద రియల్ హీరోగా మారాడు తేజ సజ్జ . తెర వెనక ఉండి సంచలనం సృష్టించాడు ప్రశాంత్ వర్మ..!!