గుంటూరు కారం అట్టర్ ఫ్లాప్ .. మహేష్ బాబు తీసుకున్న నిర్ణయానికి డైరెక్టర్ల మైండ్ బ్లాక్ అయిపోవాల్సిందే..!

గుంటూరు కారం టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు నటించిన సినిమా . సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయింది . అయితే సినిమా పరమ చెత్తగా ఉంది అనే టాక్ ను దక్కించుకుంది.  సినిమాలో పెద్దగా కంటెంట్ లేదు అని సినిమా మొత్తం డైలాగ్స్ పాటలు డాన్సులతోనే నింపేశాడని ..సినిమాలు మెసేజ్ ఓరియంటెడ్ కాదు అని ..

మరీ ముఖ్యంగా మహేష్ బాబు రేంజ్ కి తగ్గ సినిమా కాదు అని జనాలు  చెప్పుకొస్తున్నారు . అంతేకాదు ఈ సినిమా మహేష్ బాబుకు తీవ్ర నిరాశ మిగిల్చింది. ఆయనను సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురయ్యేలా చేసింది . దీంతో మహేష్ బాబు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇకపై ఏ డైరెక్టర్ అయితే ఇంటికి వచ్చి స్టోరీ చెప్తాడో.. అదేవిధంగా తెరకెక్కించాలి.

స్టోరీ చెప్పేటప్పుడు ఒకలా తెరకెక్కించేటప్పుడు మరొక్కలా చేస్తే అస్సలు ఊరుకోను . సగంలోనైనా సరే సినిమా ఆపేస్తా అంటూ మహేష్ బాబు సంచలనం నిర్ణయం తీసుకున్నారట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. ఈ నిర్ణయం మహేశ్ అభిమానులకి కూడా నచ్చేసింది. ఇక ఏ డైరెక్టర్ మహేశ్ ని చీట్ చేయలేడు.!!