“గుంటూరు కారం”లో మీనాక్షి చౌదరి పాత్రను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో.. వెరీ వెరీ లక్కీ ఫెలో..!

గుంటూరు కారం.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే సోషల్ మీడియాలో ఈ పేరుని తెగ ట్రోల్ చేసేస్తున్నారు . ఈ సినిమా మంచి కంటెంట్ ఇచ్చింది. మహేష్ బాబు నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ టాప్ దక్కించుకునింది. కలెక్షన్స్ పరంగా కుమ్మేస్తున్నా కానీ టాక్ పరంగా మాత్రం పాజిటివ్ కామెంట్స్ దక్కించుకోలేకపోతుంది .

ఎవరో అరాకొరా మంది సినిమా బాగుంది ఒకసారి చూడచ్చు అంటున్నారు తప్పిస్తే ఎక్కడ సినిమా చరిత్రను తిరగరాసే సినిమా అని మాత్రం చెప్పలేకపోతున్నారు . ఈ సినిమాలో హీరోయిన్లుగా మీనాక్షి చౌదరి – శ్రీలీల నటించారు . మీనాక్షి చౌదరి పాత్ర ఈ సినిమాలో బిస్కెట్ అని చెప్పాలి . నాలుగే నాలుగు షాట్లకు తప్పిస్తే అమ్మడు పెద్దగా ఈ సినిమాలో కనిపించలేదు . అంతేకాదు శ్రీ లీల క్యారెక్టర్ కూడా పెద్దగా ఇంపార్టెంట్ అని చెప్పలేం .

అయితే మీనాక్షి చౌదరి క్యారెక్టర్ లో ముందుగా హీరోయిన్ కీర్తి సురేష్ ని అనుకున్నాడట త్రివిక్రమ్ . సర్కారీ వారి పాట తర్వాత వీళ్ళ కాంబోపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి , గుంటూరు కారం కి అది పనికొస్తుంది అని భావించారట . కానీ శ్రీలీల ఉంటే నేను చెయ్యను అని తెగేసి చెప్పేసిందట కీర్తి సురేష్ . శ్రీలీలా ఉంటే జనాలు నన్ను పట్టించుకోరు పైగా సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ అంటే మరి తక్కువ ఉంటుంది. నాకు వద్దనే వద్దు అంటుంది రిజెక్ట్ చేసి మంచి పనే చేసింది. ఒకవేళ చేసి ఉంటే బోలా శంకర్ కి మించిన డిజాస్టర్ ఆమె ఖాతాలో పడి ఉండేది..!!