ఆ రీజన్ తో తన 36 ఎకరాల మామిడి తోట అమ్మేసిన సందీప్ రెడ్డి.. అసలు ఏం జరిగిందంటే..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏఫీల్డ్‌లో అడుగుపెట్టి సక్సెస్ సాధించాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది. కొత్త వాళ‌కి ఏళ్ల తరబడి నిర్మాతలు, దర్శకులు, హీరోలు అంటూ ఇలా ఆఫీసులో చెట్టు తిరిగితే కానీ అవకాశాలు రావు. అయితే అలా ఎంతో కష్టపడి స్టార్ట్ డైరెక్టర్గా ఎదిగిన వారిలో సందీప్ రెడ్డి వంగా ఒకడు. తాను దర్శకుడుగా ఏనాటికైనా రాణిస్తానని విశ్వాసంతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సందీప్ తను డైరెక్టర్‌గా అర్జున్ రెడ్డి మూవీని స్వయంగా నిర్మించాడు. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.5 కోట్లు అయితే జీవితంలో ఏం సాధించాలన్నా మనపై మనకి నమ్మకం ఉండాలి.

100+] Arjun Reddy Wallpapers | Wallpapers.com

లేదంటే ఎదుటి వాళ్లు మనల్ని నమ్మడం చాలా కష్టం. అలా సందీప్ రెడ్డికి తనపై ఉన్న నమ్మకమే తనకు ప్లస్ అయింది. పెళ్లిచూపులతో హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ.. ఊహించిన రేంజ్‌లో ఇమేజ్ రాలేదు. అలాగే శాలిని పండే కూడా కొత్త హీరోయిన్ కావడంతో వీరిద్దరి రెమ్యునరేషన్ చాలా తక్కువ బడ్జెట్ లో అయింది. దీంతో అధిక భాగం మేకింగ్‌కి ఖర్చు చేశారు. అర్జున్ రెడ్డి మూవీకి సందీప్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పై ప్రణయ్ రెడ్డి వంగ నిర్మించిన ఈ సినిమా పెట్టుబడి కోసం సందీప్ రెడ్డి ఏకంగా తన 36 ఎకరాల మామిడి తోటను అమ్మేసాడట.

రూ.1.5 కోట్ల ఆ ప్రాపర్టీను అమ్మి అర్జున్ రెడ్డి మూవీని నిర్మించాడ‌ని ఇంటర్వ్యూలో స్వయంగా వివరించాడు. ఒకవేళ అర్జున్ రెడ్డి ఫ్లాప్ అయి ఉంటే అతని కుటుంబం రోడ్డుపై పడాల్సి వచ్చేదని చెప్పకనే చెప్పాడు సందీప్. కుటుంబానికి చెందిన మామిడి తోటని సందీప్ రెడ్డి తాకట్టు పెట్టి డైరెక్టర్ అయ్యాడు. ఆయన నమ్మకానికి సక్సెస్ తోడైంది. దీంతో అర్జున్ రెడ్డి పెట్టుబడికి పదింతలు అంటే రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు కొల్లగొట్టింది.

విజయ్ ఓవ‌ర్ నైట్‌ స్టార్ హీరోగా క్రేజ్‌ సంపాదించుకున్నాడు. అదేవిధంగా సందీప్ రెడ్డి హిందీలో కబీర్ సింగ్ పేరుతో అర్జున్ రెడ్డి మూవీని రీమిక్ చేసి అక్కడ బ్లాక్ బస్టర్ కొట్టాడు. దీంతో బాలీవుడ్‌లో సందీప్ మార్కెట్ పెరిగింది. లేటెస్ట్ సెన్సేషన్ యానిమల్ వరల్డ్ వైడ్ వాసులు కుమ్మేయడంతో మరోసారి సందీప్ రెడ్డి మార్క్ ప్రపంచవ్యాప్తంగా ప్రూవ్ అయింది. ఇటీవల యానిమల్ 600 కోట్ల మార్కును దాటేసింది. ఇక యానిమల్ డైరెక్టర్గానే కాక నిర్మాణ భాగస్వామిగా కూడా సందీప్ రెడ్డి వ్యవహరించాడు. దీంతో అతనికి కోట్ల లాభాలు వచ్చి పడ్డాయట.