“నా పెళ్లి ఆ తెలుగు హీరో తోనే.. ఫుల్ క్లారిటీ చేసిన మృణాల్ “..పండగ చేసుకోండ్ర అబ్బాయిలు..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి విషయం ఎక్కువగా వైరల్ అవుతుంది. అసలు ఆ విషయంలో మ్యాటర్ ఉన్నా మ్యాటర్ లేకపోయినా జనాలు ఎందుకు అదే విషయాన్ని పట్టి పట్టి లాగి సోషల్ మీడియాలో నెంబర్ వన్ రేంజ్ లో ట్రెండ్ అయ్యేలా చూస్తున్నారు. రీసెంట్గా హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పెళ్ళికి సంబంధించిన విషయం కూడా అదే విధంగా ట్రెండ్ అవుతుంది. ఓ ఈవెంట్లో మాట్లాడుతూ అల్లు అరవింద్ పొరపాటున “నువ్వు కూడా తెలుగు ఇంటి కోడలు అవ్వాలి అంటూ ఆశీర్వదించారు “.

అంతే అప్పటినుంచి సోషల్ మీడియాలో మృణాల్ ఠాకూర్ తెలుగు హీరోని పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్త వైరల్ అవుతున్నాయి. అంతేకాదు కొంతమంది ఏకంగా నిశ్చితార్థమైపోయింది అంటూ కూడా వార్తలు రాసేశారు . దీంతో మృణాల్ ఠాగూర్ తన పెళ్లి వార్తలపై స్పందించింది . అంతేకాదు తన పెళ్లి పై పిచ్చ క్లారిటీ ఇచ్చింది.

ఆమె మాట్లాడుతూ..” ఈ విషయం మీకు హర్టింగ్గా ఉండచ్చు .. నేను పెళ్లి చేసుకోబోయే వరుడు ఎవరు..? ఆ తెలుగు హీరో పేరు నాకు చెప్తారా..? మా ఇంట్లో వాళ్ళు మా బంధువులు అడుగుతున్నారు ..? వాళ్ళకి చెప్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారుగా.. ఓ పని చేద్దాం మీరే.. ఆ తెలుగు హీరో ఎవరో చెప్పి.. ముహూర్తం పెట్టి నాకు పెళ్లి చేసేయండి.. నేను రెడీ నాకు ఏ ప్రాబ్లం లేదు” అంటూ తనదైన స్టైల్ లో కౌంటర్ వేసింది . దీనితో మృణాల్ ఠాకూర్ పెళ్లిపై వస్తున్న వార్తలు మొత్తం ఫేక్ అంటూ క్లారిటీకి వచ్చేసింది..!!