ఎన్టీఆర్ పై ఉన్న ప్రేమతో ఈ అభిమాని ఏం చేశాడో చూడండి.. నందమూరి ఫ్యాన్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా .. అందరికీ కామన్ గా ఇష్టమైన హీరో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పక తప్పదు. రీజన్ ఏంటో తెలియదు కానీ అందరూ హీరోల ఫ్యాన్స్ ఎన్టీఆర్ ని కామన్ గా ఇష్టపడుతూ ఉంటారు . ఎవరో ఫ్యాన్ బేస్ ఉపయోగించుకొని ఎన్టీఆర్ ని కావాలని కొందరు అప్పుడప్పుడు ట్రోల్ చేస్తూ ఉంటారు తప్పిస్తే మిగతా హీరోల ఫ్యాన్స్ అందరూ కూడా ఎన్టీఆర్ ని లైక్ చేస్తూ ఉంటారు .

అల్లు అర్జున్ – మహేష్ బాబు- ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఎన్టీఆర్ సినిమాలను సమాంతరంగా ఆదరిస్తారు . ఇక్కడ నందమూరి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ అభిమాని అంటే ఆ హీరో పుట్టినరోజుకి కేక్ కట్ చేస్తారు .. మహా ఇష్టం అంటే ఒక పదిమందికి తన స్తోమతకు తగ్గట్టు అన్నదానం రక్తదానం చేయిస్తారు .

అయితే ఇక్కడ ఈ అభిమాని మాత్రం టూ స్పెషల్ .. జూనియర్ ఎన్టీఆర్ అంటే విపరీతమైన పిచ్చితో తన సొంత ఇంటి కలను నెరవేర్చుకునే క్రమంలో ఏకంగా ఇటుకలను ఎన్టీఆర్ పేరుతో డిజైన్ చేయించుకున్నాడు . బట్టి కార్మికులకు చెప్పి ఇటుక పై ఎన్టీఆర్ పేరును ముద్రించుకున్నారు. దీనికి సంబంధించిన పిక్చర్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు . నందమూరి అభిమాని అంటే ఆ మాత్రం ఉండాల్సిందే అంటూ మీసాలు మెలేసి మరి కామెంట్స్ చేస్తున్నారు..!!