సలార్-2 రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేది ఆరోజే..!!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం సలార్.. పాన్ ఇండియా రేంజిలో ఈ సినిమాని డిసెంబర్ 25న విడుదల చేయబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం చాలామంది అభిమానుల సైతం ఎదురుచూస్తూ ఉన్నారు. Kgf సినిమాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నిల్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ మొత్తం పూర్తి అయినట్లుగా తెలుస్తోంది.


RRR సినిమా కంటే ఎక్కువగా బిజినెస్ ఈ సినిమా మీద జరుగుతోందని సమాచారం. సలార్ సినిమాని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సిద్ధమయ్యింది.వచ్చే ఏడాది ఏప్రిల్ లో సలార్ -2 సినిమా ఉండబోతుందని ఇప్పటికే చిత్ర బృందం క్లారిటీ ఇచ్చారు.అందుకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయినట్లు సమాచారం. సలార్ సినిమాలో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తూ ఉండగా విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ ,జగపతిబాబు నటిస్తూ ఉన్నారు.

బాహుబలి సిరీస్ తర్వాత ఇప్పటివరకు ప్రభాస్ కెరియర్ లో ఒక్క సక్సెస్ కూడా ఎదురు కాలేదు.. దీంతో సలార్ సినిమాతో కచ్చితంగా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంటారని అభిమానులు భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా గురించి ఒక విషయం వైరల్ గా మారుతోంది. డిసెంబర్ 25న సలార్ సినిమాకి పోటీగా షారుక్ ఖాన్ డుంకి సినిమా విడుదల కాబోతోంది.. సలార్-2 చిత్రం కూడా ఏప్రిల్ నెలలో విడుదల చేయబోతుండడంతో అదే నెలలో ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ OG సినిమా కూడా విడుదల కాబోతోంది. మరి ఈసారి ప్రభాస్ ఇద్దరితో పోటీపడే అవకాశం ఉందని సమాచారం.. మరి ఎవరు విడుదల తేదీపై మళ్ళీ క్లారిటీ ఇస్తారో చూడాలి మరి.