గుంటూరు కారం నుంచి సాంగ్ లీక్.. ఊర మాస్ కొట్టుడే..

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున మూవీ గుంటూరు కారం. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. త్రివిక్రమ్ డైరెక్షన్లో తరికేకుతున్న ఈ సినిమాకు సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే పలు ఇంటర్వ్యూలో నాగవంశీ మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ఇక నాగ‌ వంశీ చేసిన కామెంట్ సినిమాపై మరింత ఆసక్తి పెంచాయి. సంక్రాంతి కానుకగా గుంటూరు కారం సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఏవి రాకపోయినా సినిమా నుంచి రిలీజ్ అయ్యే పోస్టర్ల ద్వారానే ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ అయింది.

ఇక ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ సాంగ్ అయినా రిలీజ్ చేస్తారేమోనని ఎప్పటినుంచో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే గుంటూరు కారం మూవీ ఫస్ట్ సింగిల్‌ రిలీజ్ చేయనున్నారు. ఇలాంటి నేపథ్యంలో గుంటూరు కారం మొదటి సాంగ్ అంటూ ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. సినిమా అప్డేట్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన అభిమానులకు ఈ లిరిక్స్ నిజంగానే మంచి ఊరటగా అనిపించాయి. గుంటూరు కారం సినిమాకు థ‌మన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు లీక్ అయిన గుంటూరు కారం ఫస్ట్ సాంగ్ పై ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు . ఎదురొచ్చే గాలి ఎగరేస్తున్న చొక్కా పై గుండి అంటూ ప్రారంభమైన ఈ సాంగ్ బిట్.. బిర్యానీ.. అరకోడీ మసాలా లాంటి మాస్ పదాలను జోడి చేసుకుంది. పాట ప్రారంభంలో వచ్చే చిన్న బిట్ ఈ రేంజ్ లో ఊరు మాస్ గా ఉందంటే ఇంకా సాంగ్ మొత్తం ఏ రేంజ్ లో ఉంటుందో అనే ఆశ‌క్తి మహేష్ ఫ్యాన్స్ లో మొదలైంది. అయితే ఈ లీక్ అయిన బిట్ బట్టి సాంగ్ ఎలా ఉంటుంది అనేది చెప్పలేము.

ఏది ఏమైనా ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సోషల్ మీడియాలో పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎవరైనా సెట్లో ప్లే చేసినప్పుడు సాంగ్ మొబైల్ లో రికార్డ్ చేసి ఉండవచ్చని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది ఒరిజినల్ సాంగ్ ఇది కాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇది ఒరిజినలా కాదా అనేది ఫస్ట్ సింగిల్ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తే కానీ తెలియదు. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్ గా శ్రీ లీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.