అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏఎన్ఆర్ ని ఒక్క అడుగు కూడా వెయ్యనివ్వకుండా ఆరోజు ఎందుకు ఆపారు… ?అసలేం జరిగిందంటే…!!

ఏఎన్ఆర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు. ఆయన వారసత్వాన్ని నిలబెడుతూ నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఇండస్ట్రీ లోకి వచ్చారు. ఇదిలా ఉంటే ఒక రోజు ఏఎన్నార్ గారి లైఫ్ లో ఒక సంఘటన చోటుచేసుకుందట. ఈయ‌ని అన్నపూర్ణ స్టూడియోస్ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారట.

అసలు ఎందుకు ఆపారు? అసలేం జరిగింది? అనే విషయాల్లోకి వెళ్తే… రోజు ఈయన స్టూడియో నుంచి ఇంటికి వాకింగ్ చేసుకుంటూ వెళ్లేవారట. కానీ ఒకరోజు స్టూడియో కి వెళ్తే అక్కడున్న వాచ్ మెన్ ఈయని ఆపేశారు. లోపలికి వెళ్లడానికి అస్సలు అనుమతి ఇవ్వలేదట. ఆ వాచ్ మెన్ కొత్తోడట. దీనితో ఆయనకు నాగేశ్వరరావు అంటే ఎవరో తెలియక ఆయనని వెళ్ళనివ్వలేదట.

నాగేశ్వరరావు గారు నేను అన్నపూర్ణ స్టూడియోస్ కి ఓనర్ అని చెప్పినా సరే లోపలికి అస్సలు పంపించలేదట. ఆ సమయంలో నాగేశ్వరరావు గారికి ఏం చేయాలో తెలియక.. ఆ వాచ్ మెన్ ని అపాయింట్ చేసిన వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెబితే.. ఆయన వచ్చి ఈయ‌నే ఓనర్ అని చెప్పారట. అప్పుడు ఆ వాచ్మెన్ క్షమించండి అంటూ కాళ్ళ మీద పడ్డాడట. ఇలా ఆ క్రమంలో వాచ్మెన్ కారణంగా ఏఎన్నార్ గారిని అన్నపూర్ణ స్టూడియోస్ లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారట. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.