అమ్మ బాబోయ్.. వరుణ్ పెళ్లిలో రామ్ చరణ్ ధరించిన ఈ వాచ్ ఎన్ని కోట్లో తెలుసా… స్పెషాలిటీస్ ఇవే…!!

వరుణ్, లావణ్యల పెళ్లి ఇటలీలో అంగరంగ వైభోగంగా జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ నవంబర్ ఒకటో తేదీన ఒకటయ్యారు. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ అంతా పాల్గొంది. అంతేకాకుండా హడావిడి చేస్తూ డ్యాన్సులు, పార్టీలు సైతం జరుపుకున్నారు. అలాగే వీటికి సంబంధించిన ఫోటోలు సైతం షేర్ చేశారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో నెట్టింట చెక్కర్లు కొడుతున్నాయి. ఏది ఎలా ఉన్నా మెగా ఫ్యామిలీ మొత్తం ఒకే ఫ్రేమ్లో కనబడి చాలా సంవత్సరాలు దాటాయి.

వరుణ్ పుణ్యమా అంటూ మళ్లీ ఒకే ఫ్రేమ్లో చూడగలిగాము అంటూ… వైరల్ అవుతున్న ఫోటోలను మరింత వైరల్ చేస్తూ వాళ్ళ పాపులారిటీని పెంచేస్తున్నారు మెగా అభిమానులు. ఈ క్రమంలోనే వారు ధరించిన దుస్తుల ధర, నగల ధర గురించి ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ కలిసి నవ్వులు చిందిస్తున్న ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. ఇక ఈ ఫోటోలో రామ్ చరణ్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా తన చేతికి ధరించిన వాచ్ అద్భుతంగా ఉందంటూ కామెంట్లు సైతం వచ్చాయి. ఈ క్రమంలోనే చరణ్ వాచ్ గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు.

ఈ వాచ్ ధర తెలుసుకుని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మరి ఆ వాచ్ ధర ఎంతో మీకు కూడా తెలుసుకోవాలని ఉందా? అయితే పదండి చూసేద్దాం. రామ్ చరణ్ చేతికి ఉన్న వాచ్ ఖరీదు దాదాపు 28500 డాలర్స్, ఇండియన్ కరెన్సీలో 2 కోట్ల 85 లక్షల ఖరీదు చేస్తుంది. ఈ ధర చూసిన ప్రేక్షకులు కళ్ళు తేలేశారు. చరణ్ కు ఇలాంటి వాచెస్ అంటే చాలా ఇష్టమని.. తన దగ్గర ఇలాంటి ఖరీదైన వాచ్ లు ఎన్నో ఉన్నాయని.. ఈయన పలు సందర్భాలలో వెల్లడించారు. ఈ వార్త విన్న ప్రేక్షకులు…” అంత ఖరీదైన వస్తువులు వాడడం కేవలం మెగా ఫ్యామిలీకే సాధ్యం ” అంటూ కామెంట్లు చేస్తున్నారు.