గోపీచంద్ సినిమాలో విలన్ గా ఆ స్టార్ హీరో..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలామంది విలన్ గా ఎంట్రీ ఇచ్చి హీరోగా సక్సెస్ అయిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో హీరో గోపీచంద్ కూడా ఒకరు. గోపీచంద్ ఎంచుకునే కథలు బాగానే ఉన్నప్పటికీ సరైన సక్సెస్ మాత్రం అందుకోలేక పోతున్నారు. తాజాగా డైరెక్టర్ శ్రీనువైట్ల కాంబినేషన్లో ఒక సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే శరవేగంగా జరుపుకుంటోంది. చివరిగా గోపీచంద్ కూడా రామబాణం సినిమాలో నటించగా ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. దీంతో అటు డైరెక్టర్ ఇటు గోపీచంద్ ఇద్దరికీ కూడా సక్సెస్ కావాల్సిందే.

ఇక వీరిద్దరి కాంబినేషన్లో సినిమా చేయాలనే ఆలోచన వచ్చినప్పటి నుంచి కొద్ది రోజుల్లో గ్యాప్ లోనే ఈ సినిమా షూటింగ్ ని మొదలుపెట్టి పలు రకాల అప్డేట్లను తెలియజేస్తూ ఉన్నారు.. ఒకవేళ ఈ సినిమా కనుక హిట్ అయితే గోపీచంద్ కెరీర్ చాలా సాఫీగా సాగుతుందని చెప్పవచ్చు. లేకపోతే భారీగా మార్కెట్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. డైరెక్టర్ శ్రీనువైట్ల కూడా వరుస ప్లాపులతో ఉండడంతో మళ్ళీ డైరెక్టర్గా సక్సెస్ కావాలి అంటే హిట్ పడితే మరిన్ని అవకాశాలు వస్తాయి.

అయితే ఇప్పుడు ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని చిత్ర బృందం భావించగా ఈ సినిమాలో విలన్ గా తమిళ ఇండస్ట్రీలో నుంచి మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటుడు మాధవాన్ ని ఎంచుకున్నట్లు సమాచారం. ఈ సినిమా అనేది కచ్చితంగా శ్రీనువైట్ల కి లైఫ్ ఇస్తుందని అభిమానులు తెలియజేస్తున్నారు. మరి విలన్ గా మాధవన్ నటిస్తున్నారా లేదా అనే విషయంపై ఇంకా చిత్రబృందం క్లారిటీ ఇవ్వలేదు.